Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం: 2 గంటలుగా గాల్లోనే చక్కర్లు, చివరకు

ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. హైడ్రాలిక్ వ్యవస్థ పనిచేయడం లేదంటూ తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు పైలట్లు. తమిళనాడులోని తిరుచ్చి మీదుగా వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు అరగంట సమయం పట్టనుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ విమానం ల్యాండింగ్ పై ఉత్కంఠ నెలకొంది. కాగా, రెండు గంటల నుంచి ఎయిరిండియా విమానం గాల్లోనే చక్కర్లు కొడుతుండటం గమనార్హం.

Air India flight suffers technical glitch Circles in mid-air for two hours

అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ల్యాండింగ్ కావాలంటే అందులో ఉన్న ఇంధనం నిర్దేశిత స్థాయి వరకు తగ్గాల్సి ఉంటుంది. అప్పుడు విమానం ల్యాండింగ్ చేసే వీలుంటుంది. ఈ నేపథ్యలో సురక్షిత ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు పైలట్లు. దాదాపు రెండు గంటల నుంచి గాల్లోనే తిప్పారు.

మరోవైపు, తిరుచ్చి విమానాశ్రయానికి 20 వరకు అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేరుకున్నాయి. పెద్ద మొత్తంలో భద్రతా దళాలు, సహాయక సిబ్బంది కూడా చేరుకున్నారు. కాగా, రెండు గంటలుగా గాల్లోనే తిరిగిన ఎయిర్ ఇండియా విమానం చివరకు తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైనట్లు తెలిసింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఎయిరిండియా విమానం AXB 613 తిరుచ్చి నుంచి షార్జాకు శుక్రవారం సాయంత్రం బయల్దేరింది. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థ విఫలమైనట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఏటీసీకి తెలియజేయడంతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చారు.

ఈ క్రమంలో సురక్షిత ల్యాండింగ్ కోసం దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే తిరిగిన ఎయిరిండియా విమానం.. చివరకు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరుచ్చి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండైంది. కాగా, ఎయిరిండియా విమానంలో తిరుచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయదశమి పర్వదినం వేళ పెను ప్రమాదం తప్పిందంటూ అమ్మవారిని తలచుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+