• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా విమాన ప్రమాదం: అత్యంత వేగంగా రన్‌వేపైకి, వ్యాలీలో రెండు ముక్కలుగా..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 17కు చేరింది. శుక్రవారం రాత్రి 191 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానం రన్ వేపై నుంచి జారి రెండు ముక్కలైన విషయం తెలిసిందే.

19కి చేరిన మృతులు.. సహాయక చర్యలకు ఆటంకాలు

19కి చేరిన మృతులు.. సహాయక చర్యలకు ఆటంకాలు

ఈ ప్రమాద ఘటనలో పైలట్, కో-పైలట్ సహా ఇప్పటి వరకు 19 మంది మరణించారు. మరో 120 మంది గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో సుమారు 45 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షం, వెలుతురు లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.

అత్యంత వేగంగా రన్‌వేపైకి విమానం..

అత్యంత వేగంగా రన్‌వేపైకి విమానం..

విమానాశ్రయంలో క్రాష్ అయిన విమానం రన్ వే నుంచి 50 అడుగుల దూరంలోని వ్యాలీలో రెండు ముక్కలుగా పడిపోయింది. దుబాయ్-కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన విమానం అత్యంత వేగంతో రన్ వేపై క్రాష్ అయ్యిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది. రెండుసార్లు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన తర్వాత మూడోసారి ప్రయత్నంలో క్రాష్ అయ్యిందని తెలిపారు. రన్ వేపైభారీగా వర్షపు నీరు, వెలుతురు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

విమనాయాన శాఖ మంత్రి దిగ్భ్రాంతి..

ప్రమాద ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 191 మంది దుబాయ్ నుంచి కోజికోడ్ విమానాశ్రయం వచ్చిన ఎయిరిండియా విమానం రన్ వేపైకి వర్షపు నీరు చేరుకున్న కారణంగా జారిపోయి రెండు ముక్కలైందని మంత్రి తెలిపారు. ప్రమాద క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు గుర్తించిన మృతులు వీరే..

ఇప్పటి వరకు గుర్తించిన మృతులు వీరే..

ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన పలువురు వివరాలను అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీ ఆస్పత్రి కోజికోడ్ అందించిన వివరాల ప్రకారం.. మృతుల్లో 1. సహీర్ సయీద్(38) తిరూర్, 2 మొహ్మద్ రియాస్(23) పాలక్కడ్, 3. గుర్తించని మహిళ(45), 4. గుర్తించని మహిళ(55), గుర్తించని చిన్నారి(1.5ఏళ్లు)

ఎంఐఎంఎస్ ఆస్పత్రిలో దీపక్ వసంత్, అఖిలేష్, మరొకరు, బేబీ మెమోరియల్ ఆస్పత్రిలో 1. షరాఫుద్దీన్, 2. రాజీవన్ మృతి చెందారు.

Recommended Video

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia
తాజా విమాన ప్రమాదంఎలా?: హెల్ప్‌లైన్ నెంబర్లు..:

తాజా విమాన ప్రమాదంఎలా?: హెల్ప్‌లైన్ నెంబర్లు..:

విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగా సరిగా రన్ వే కనిపించకపోవడంతో ఎయిరిండియా విమానం క్రాష్ అయ్యిందని, ఆ తర్వాత రెండుగా ముక్కలైందని ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. విమానంలో 191 మంది ఉన్నారని తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రన్ వేపై నీరు చేరడంతో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. బోయింగ్ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోజికోడ్ విమాన ప్రమాదం : హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల 0543090572, 543090575, 0565463903, 0543090572

English summary
Directorate General of Civil Aviation (DGCA) told news agency ANI that the Dubai-Kozhikode aircraft was at "full speed" while landing at the Karipur Airport and overshot the runway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X