వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటాల చేతికి ఎయిర్ ఇండియా- జాతీయీకరణ నుంచి ప్రైవేటీకరణ వరకూ...

|
Google Oneindia TeluguNews

దేశ చరిత్రలోనే ఇవాళ ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం ప్రైవేటు సంస్ధ ఆధ్వర్యంలో ఉన్న ఓ భారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం జాతీయీకరణ పేరుతో స్వాధీనం చేసుకుంది. తిరిగి ఇప్పుడు అదే సంస్ధను అంతకు పదింతలు రేటుతో దాన్ని అమ్మిన సంస్ధకే విక్రయించింది. దీంతో దేశ పారిశ్రామిక రంగంలోనే చారిత్రక ఘట్టానికి ఇవాళ సాక్ష్యంగా నిలవబోతోంది. ఎయిర్ ఇండియాను 68 ఏళ్ల క్రితం టాటా సన్స్ నుంచి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు అదే సంస్ధకు దాన్ని విక్రయించేసింది.

టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా

దేశ వైమానిక రంగంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిర్ ఇండియా నష్టాల్లో కూరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్వహించలేక చేతులెత్తేసింది. వంద శాతం పెట్టుబడుల్ని ప్రైవేటీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా జరిగిన వేలంలో ప్రతిష్టాత్మక టాటా సన్స్ సంస్ధ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. ఆకర్షణీయ ధరతో పాటు భవిష్యత్తులో దాని నిర్వహణకు టాటా గ్రూప్ ఇచ్చిన ప్లాన్ కేంద్రాన్ని మరో మాట లేకుండా చేసేసింది. దీంతో టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లిపోయింది.

టాటా నుంచి టాటాలకు

టాటా నుంచి టాటాలకు

దేశ స్వాతంత్రానికి ముందు టాటాలు నెలకొల్పిన టాటా ఎయిర్ లైన్స్.. తిరిగి పలు రూపురేఖలు మార్చుకుని ఎయిర్ ఇండియాగా కొనసాగుతూ తిరిగి టాటాల చేతుల్లోకే ఇవాళ వెళ్లిపోయింది. 1953లో టాటాలు నెలకొల్పిన తొలి దేశీయ ఎయిర్ లైన్స్ సంస్ధ అనేక మలుపులు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి రావడం, అనంతరం జాతీయీకరణ జరగడం, తిరిగి వారి చేతుల్లోకే వెళ్లిపోవడం అంతా సినిమా చూస్తున్నట్లే జరిగిపోయింది. దీంతో టాటాలు మొదలుపెట్టిన ఎయిర్ లైన్స్ ప్రస్దానం తిరిగి వారి చేతుల్లోకే చేరిపోయింది.

 68 ఏళ్ల విరామం తర్వాత టాటాల చేతికి

68 ఏళ్ల విరామం తర్వాత టాటాల చేతికి

టాటా ఎయిర్ లైన్స్ సంస్ధను 1932లో టాటా గ్రూప్ ప్రారంభించింది. తద్వారా విమానయాన రంగంలోకి టాటా గ్రూప్ ప్రవేశించింది. స్వతహాగా పైలట్ అయిన జంషెడ్ జీ టాటా తొలి విమానాన్ని తానే నడిపి టాటా ఎయిర్ లైన్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత 1953లో కేంద్ర ప్రభుత్వం జాతీయీకరణ పేరుతో టాటా ఎయిర్ లైన్స్ ను స్వాధీనం చేసుకుంది. అయినా 1977 వరకూ టాటాలే దాని నిర్వహణ చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం ఎయిర్ ఇండియాగా పేరు మార్చి ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ వచ్చింది. సరిగ్గా 68 ఏళ్ల తర్వాత తిరిగి టాటాల మానసపుత్రిక ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ పేరుతో తిరిగి వారికే అప్పగించాల్సి వచ్చింది.

 విధి వైచిత్రి

విధి వైచిత్రి


దాదాపు ఏడు దశాబ్దాల క్రితం టాటా గ్రూప్ ప్రారంభించిన ఎయిర్ లైన్స్ సంస్ధ కేంద్రం స్వాధీనం చేసుకోవడం దగ్గరి నుంచి తిరిగి వారికి అప్పగించడం వరకూ జరిగిన పరిణామాలు విధి వైచిత్రిగా కనిపిస్తాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఏ నమ్మకంతో టాటా గ్రూప్ నుంచి ఎయిర్ లైన్స్ ను స్వాధీనం చేసుకుందో తెలియదు కానీ, కొన్నేళ్లుగా దాన్ని నిర్వహించలేక ఇప్పటి కేంద్ర ప్రభుత్వం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో కేంద్రమే ఎయిర్ ఇండియాను అమ్ముకోవాల్సిన పరిస్ధితి దాపురించింది. దీంతో టాటా సన్స్ దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఎలాగో తాము మానసపుత్రికే కావడం, నష్టాల్లో ఉన్న ఎన్నోన సంస్ధల్ని కొనుగోలు చేసి వాటిని లాభాల బాట పట్టించిన దార్శనికత టాటాల సొంతం. కాబట్టి టాటాలు ప్రారంభించిన ఎయిర్ లైన్స్ తిరిగి వారి చేతుల్లోకి వెళ్లనుండటాన్ని ప్రతీ భారతీయుడూ హర్షిస్తున్నాడు.

English summary
the union government on today announced that tata sons wins the bid of air india for rs.18000 cr. with this air india has returned to its mother organisation tata sons after 68 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X