వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మగ్లింగ్ కేసులో ఎయిర్ ఇండియా సిబ్బంది!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/లండన్: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సిబ్బందిని లండన్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిషేధిత ఔషదాలు స్మగ్లింగ్స్ చేస్తున్నారని ఎయిర్ ఇండియా సిబ్బంది మీద కేసు నమోదు చేశారు.

తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎయిర్ ఇండియా సిబ్బంది మీద కేసు నమోదు చేసి న్యాయస్థానం అనుమతితో కస్టడిలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని లండన్ అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

భారత్ లో బెనడ్రిల్ కాఫ్ సిరఫ్ (దగ్గు మందు) విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బెనడ్రిక్ కాఫ్ సిరఫ్ ఎక్కువ మోతాదులో సేవిస్తే మాదకద్రవ్యాలు (డ్రగ్స్) సేవించిన అనుభూతి కలుగుతుందని లండన్ పరిశోదకులు గుర్తించారు.

Air India's cabin crew on a Delhi-London flight was caught smuggling

ఈ బెనడ్రిల్ కాఫ్ సిరఫ్ ను లండన్ నగరంతో పాటు యునైటెడ్ కింగ్ డమ్ లో నిషేధిస్తున్నామని అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెల న్యూఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో 450 బాలిల్స్ బెనడ్రిల్ కాఫ్ సిరఫ్ తరలించారు.

విషయం గుర్తించిన లండన్ కస్టమ్స్ అధికారులు నిషేదిత కాఫ్ సిరఫ్ ను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన క్యాబిన్ క్రూ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహిళా సిబ్బంది పాత్రకూడ ఉందని లండన్ కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకాలం ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న ఎయిర్ ఇండియా ఇప్పుడు విషయం వెలుగు చూడటంతో మౌనం వీడింది. తప్పు చేసిన విమాన సిబ్బంది మీద కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి మహేష్ శర్మ స్పష్టం చేశారు.

English summary
About 450 bottles of Benadryl cough syrup were seized by Air India’s cabin crew on Delhi-London flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X