ఎయిర్ఏషియా మరో బడ్జెట్ ఆఫర్: రూ. 599కే టికెట్

న్యూఢిల్లీ: బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ప్రయాణికుల కోసం మరో మంచి ఆఫర్‌తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్‌లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 11 వరకు అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్‌ 28 మధ్య ఎయిర్‌ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ప్రస్తుత ఈ ఆఫర్ ప్రకారం.. గౌహతి-ఇంఫాల్‌కు అన్ని ఛార్జీలు కలిపి విమాన టికెట్‌ ధర రూ. 599గా ఉంది.

దీంతోపాటు, బెంగళూరు నుంచి కొచ్చీకి రూ. 899, గోవాకు రూ. 1,099, విశాఖపట్నానికి రూ. 1,199, ఢిల్లీకి రూ. 2,299, పుణెకు రూ. 1,299గా టికెట్‌ ధరలుగా ఉండనున్నాయి.

AirAsia India Offers All-Inclusive Tickets From Rs 599

అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ఎయిర్‌ఏషియా.. ముందస్తు టికెట్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. ఆఫర్‌ కింద కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు టికెట్‌ ధర రూ. 3,399గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లను కేటాయించబోతోందన్న విషయాన్ని మాత్రం ఎయిర్‌ఏషియా వెల్లడించలేదు.

గత రెండేళ్లపాటు స్వల్ప నష్టాల్లో నడిచిన ఎయిర్ఏషియా.. గత జూన్‍లో మాత్రం తన ఆదాయాన్ని 73శాతం పెరిగి రూ. 189కోట్లకు చేరుకుంది. కాగా, ఎయిర్ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమర్ అంబ్రోల్ మాట్లాడుతూ.. ఎయిర్‌లైన్స్ మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+