ఎయిర్ఏషియా సూపర్ సేల్: రూ.500కే విమాన టికెట్
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఏషియాఇండియా ప్రయాణికుల కోసం సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ మార్గంలో రూ.500కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సోమవారం నుంచి ఈ బంపర్ ఆఫర్‌ను అమలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటనలో వెల్లడించింది.
దేశీయంగా 21మార్గాల్లో ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. రూ.500, రూ. 1,000, 1,500 రూపాయల మధ్య ఈ వన్ వే టికెట్లను డిస్కౌంట్ రేట్లలో అందిస్తోంది. ఈ సూపర్ సేల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే చివరి తేదీ సెప్టెంబర్ 23గా నిర్ణయించింది.

ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 17 - మార్చి 31, 2019 వరకు ప్రయాణం చేయవచ్చని ఎయిర్ఏషియా ప్రకటించింది. ఎయిర్ఏషియా.కాం, ఎయిర్ఏషియా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ సూపర్ సేల్ ఆఫర్‌లో విమాన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్, విశాఖపట్నం, అమృత్‌సర్, బాగ్ధోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కొచ్చి, నాగపూర్, న్యూఢిల్లీ, పనాజీ, పుణె, రాంచీ, శ్రీనగర్, సూరత్ నగరాలకు సర్వీసులను ఎయిర్ఏషియా అందిస్తోంది.












Click it and Unblock the Notifications