వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్‌కు మరో తలనొప్పి: రేప్ నిందిత మంత్రి మిస్సింగ్, విమానాశ్రయాల్లో అలర్ట్

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మరో తలనొప్పి వచ్చిపడింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మరో తలనొప్పి వచ్చిపడింది. బాలికపై అత్యాచారయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రీ ప్రజాపతి కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయన్న సమాచారంతో విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించారు.

ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాపతి అమేథీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వారం రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Airport alert for rape-accused UP min Prajapati, CM promises help in the case

అయితే, ప్రజాపతి వ్యవహారం ముఖ్యమంత్రి అఖిలేష్ మెడకు చుట్టుకుంది. ఈ విషయంలో ప్రధాని మోడీ అఖిలేష్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి వస్తుందని, తాను కూడా అలాగే చేశానని సీఎం పేర్కొన్నారు.

కాగా, అవినీతి ఆరోపణలు రావడంతో నిరుడు అఖిలేష్ తన మంత్రివర్గం నుంచి ప్రజాపతిని తప్పించడం గమనార్హం. అయితే తండ్రి ములాయం సింగ్ యాదవ్, శివపాల్ బలవంతంతో తిరిగి ఆయనను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.

English summary
Airports across the country were on Friday alerted about the possibility of rape-accused UP minister Gayatri Prasad Prajapati trying to flee the country even as chief minister Akhilesh Yadav promised all help in the case.
Read in English: Gayatri may flee country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X