వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో దెబ్బ: 3 నెలలకు రూ.550 కోట్లు నష్టపోతోన్న ఎయిర్‌టెల్

రిలయన్స్ జియో కారణంగా టెలికం పరిశ్రమ వేలాది కోట్లను కోల్పోయింది. తాజాగా దేశీయ అతి పెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ జియో కాల్స్ సునామీతో వచ్చే నష్టాలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. జియో కాల్స్ సునా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కారణంగా టెలికం పరిశ్రమ వేలాది కోట్లను కోల్పోయింది. తాజాగా దేశీయ అతి పెద్ద టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ జియో కాల్స్ సునామీతో వచ్చే నష్టాలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. జియో కాల్స్ సునామీతో తమకు ప్రతి మూడు మాసాలకు రూ. 550 కోట్ల నష్టం వస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది.

తమ ప్రత్యర్థి నెట్‌వర్క్ నుండి వచ్చే కాల్స్ నిర్వహించడానికి ఒక్కో నిమిషానికి 20 పైసలు నష్టపోతున్నట్టు గురువారంనాడు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఉచిత వాయిస్‌కాల్స్, డేటా కారణంగా ప్రత్యర్థి కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ గురువారం నాడు ప్రకటించింది. జియో కారణంగా టెలికం కంపెనీల ఆదాయం భారీగా కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌టెల్ స్థాపించిన హైవేపై జియో ఉచితంగా ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకొందని మండిపడింది.

భారత్ టెలికం మార్కెట్‌లో పోటీ వాతావరణం ఉండాలని, ఆధిపత్యం ఉండకూడదనే అభిప్రాయాన్ని టెలికం కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.

జియో ఆరోపణలను తోసిపుచ్చిన ఎయిర్‌టెల్

జియో ఆరోపణలను తోసిపుచ్చిన ఎయిర్‌టెల్

మొబైల్ టెర్మినేషన్ చార్జీ(ఎంటీసీ) ద్వారా ఎక్కువ రెవిన్యూలు ఆర్జిస్తున్నాయనే జియో ఆరోపణలను కూడ ఎయిర్‌టెల్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంది. ఎంటీసీలను రద్దుచేస్తే జియో దోపిడిపూరిత ధరల విధానం మరింత కొనసాగుతోందని కంపెనీ చెప్పింది. జీరో ఎంటీసీతో రిలయన్స్ జియో, తన ఖర్చులను ఎయిర్‌టెల్ ఇతర ఆపరేటర్లకు మళ్ళించాలని చూస్తోందని ఆరోపించింది

రిలయన్స్ సర్‌ప్రైజ్

రిలయన్స్ సర్‌ప్రైజ్

ఆయిల్ నుండి టెలికం వరకు మార్కెట్‌లో తన హావా చాటుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.వారి అంచనాలను అధిగమించి లాభాల్లో అదరగొట్టింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్ లాభాల్లో 12.7 శాతం జంప్ చేసి రూ.9,079 కోట్ల లాభాలను నమోదుచేసింది. ఈ లాభాలు రూ.7,960 కోట్లగా మాత్రమే ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు.

కన్సాలిడేషన్ రెవిన్యూ రూ. 90, 537

కన్సాలిడేషన్ రెవిన్యూ రూ. 90, 537

కన్సాలిడేషన్ రెవెన్యూలు సీక్వెనిష్యల్ ఆధారితంగా 2.5 శాతం పడిపోయి రూ.90,537 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ పేర్కోంది. ఇవి అంతకుముందు క్వార్టర్‌లో రూ. 92,889 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను లీడ్ చేసే ముఖ్యమైన ఆస్తులు రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారాల రెవెన్యూల్లో కంపెనీల మెరుగైన వృద్దిని సాధించిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ చెప్పారు.

ఈబీఐటీల వృద్ది

ఈబీఐటీల వృద్ది

రిలయన్స్ జియో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు బ్యారల్‌కు 11.9 డాలర్లు ఉన్నట్టు తెలిసింది. పెట్రో కెమికల్ సెగ్మెంట్‌లో ఈబీఐటీకి ముందున్న ఆదాయాలు రూ.4,031 కోట్లకు పెరిగాయి. రిఫైనింగ్ ఈబీఐటీలు కూడ 7,476 కోట్లుగా రిలయన్స్ నమోదు చేసింది.రిటైల్ వ్యాపారాల్లో కూడ గణనీయమైన వృద్దిని సాధించింది. 74 శాతంగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ క్వార్టర్‌లో కంపెనీ ఫైనాన్స్ ఖర్చులు, ఈ క్వార్టర్‌లో రూ.1,119 కోట్లను నమోదుచేశాయి. కానీ ఏడాది ఏడాదికి మాత్రం 7.2 శాతం తగ్గాయి.

English summary
Bharti Airtel India’s largest telecom operator, on Thursday claimed it was incurring a loss of Rs 550 crore per quarter due to a tsunami of calls originating from the Reliance Infocomm Jio network.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X