Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు: ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె కూడా: నెగెటివ్ రిపోర్ట్ ఒక్కరికే

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని చుట్టుముట్టింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్య కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. వారికి రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మూడో దఫా నిర్వహించిన పరీక్షలు పాజిటివ్‌గా తేాలాయి.

ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా సోకినట్లు డాక్టర్లు తెలిపారు. జయా బచ్చన్‌కు నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ధృవీకరించారు. ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకిందని తెలిపారు. జయా బచ్చన్‌కు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అన్నారు. బచ్చన్ కుటుంబం కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు రాజేష్ తోపే చెప్పారు. బచ్చన్ కుటుంబంలో మొత్తం నలుగురికి కరోనా వైరస్ సోకినట్టయింది.

అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌ కరోనా వైరస్ బారిన పడినట్టు తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయినీ మహకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా హోమాన్ని జరిపించారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. తమ ఆరాధ్య దైవం త్వరగా కోలుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ప్రార్థించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో ఆదివారం ఉదయం నుంచీ ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్నాయి.

Aishwarya Rai Bachchan and her daughter Aaradhya Bachchan test positive for COVID 19

అదే సమయంలో- ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంత పట్ల అభిమానులు నిర్ఘాంతపోతున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. బచ్చన్ కుటుంబానికి అండగా ఉన్నామంటూ మనోధైర్యాన్ని ఇస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య త్వరగా కోలుకుంటారని, సాధారణ జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు జయా బచ్చన్‌కు ఫోన్ చేస్తున్నారు. ఆమెకు ధైర్యాన్ని ఇస్తున్నారు.

Recommended Video

    #AmitabhBachchan : ఆ ఒక్క నిమిషమే Amitabh Bachchan ప్రాణాల మీదకు తెచ్చింది! || Oneindia Telugu

    కాగా, ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం ఉంటోన్న బంగళా, ఆ ప్రాంతాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ నివాస్ జల్సాను శానిటైజ్ చేశారు. ఇంట్లో పని చేసే వారికి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ శానిటైజ్ చేస్తున్నారు. 15 రోజుల వరకు ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించినట్లు వెల్లడించారు. సాయంత్రం వరకూ శానిటైజ్ కొనసాగుతుందని తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+