ఇదేం ప్రవర్తన!: పనామాపై ప్రశ్న, ఐశ్వర్యకు చిర్రెత్తుకొచ్చింది
ముంబై: ఇటీవల పనామా పేపర్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న కొందరి పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.
పనామా పత్రాల్లో తన పేరు ఉండటాన్ని పాత్రికేయులు ప్రశ్నించగా ఐశ్వర్య రాయ్ అసహనం ప్రదర్శిచారు. ఇందులో మీకు ఎందుకంత ఉత్సాహం అని మండిపడ్డారు. అయితే, ఐశ్వర్య ప్రవర్తన పైన విమర్శలు వస్తున్నాయి.
ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, రణదీప్ హుడా నటిచిన బయోపిక్ సరబ్ జిత్ ట్రయలర్ విడుదల సందర్భంగా ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు పనామా పత్రాల్లో ఆమె పేరు ఉండటంపై ప్రశ్నలు కురిపించారు.

ఈ సందర్భంగా ఆమె మౌనం వహించింది. అక్కడే ఉన్న హీరో రణదీప్ హుడా జోక్యం చేసుకొని ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. కేవలం సినిమాకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించాలని కోరారు. అయినా ఓ జర్నలిస్ట్ విదేశీ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై ప్రశ్నించాడు.
దీంతో ఐశ్వర్యకు చిర్రెత్తుకొచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము ఓ ప్రకటన చేశామని, అది మీ అందరికీ తెలుసునని, మీరు ఒక్కరే అడుగుతున్నారని మండిపడ్డారు. ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని సదరు విలేకరిని ప్రశ్నించారు. ఓ ప్రకటన ఇచ్చామని, దానిని చూసుకోవాలని ఆమె మేనేజర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications