భారత్‌కు అమెరికా సాయం చేసిందా: దాడులు చేస్తున్నట్లు దోవల్ ముందస్తు సమాచారమిచ్చారా..?
పాకిస్తాన్‌పై మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం దాడులు చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యలో భాగంగానే భారత్ రియాక్ట్ అయ్యింది. పాకిస్తాన్ పై దాడుల సంగతి గురించి ముందుగానే అమెరికా జాతీయ భద్రతాధికారి జాన్ బోల్టన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చర్చించినట్లు సమాచారం. ఫిబ్రవరి 16వ తేదీన ఫోన్ చేసిన సమయంలో దాడులపై ఇరు దేశాధికారులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
భారత్ ఎలాంటి దాడులు చేయనుందో అనే అంశంపై అమెరికాతో అజిత్ దోవల్ పంచుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బాలాకోట్‌లో దాడులు జరుపుతామని ముందుగానే సమాచారాన్ని జాన్ బోల్టన్‌తో పంచుకున్నారు. ఇక ప్లాన్‌లో ఎలాంటి మార్పులేకుండా భారత వాయుసేన అమలు చేసింది. మొత్తం 21 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తి చేసి తిరిగి భారత భూభాగం పైకి చేరుకుంది. ఈ ఆపరేషన్‌లో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సమాచారం. ఇందులో చాలామంది ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొందుతున్నారు. అమెరికా నుంచి భారత్‌కు పాక్ పై దాడుల విషయంలో పూర్తి మద్దతు ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ద్వంసం చేయాడాన్ని ప్రపంచదేశాలు భారత్‌కు అభినందనలు తెలుపుతున్నాయని సమాచారం.

ఫిబ్రవరి 16 తర్వాత బోల్టన్ రెండు సార్లు దోవల్‌తో మాట్లాడినట్లు సమాచారం. భారత్ దాడులు చేయడం సరైన నిర్ణయమే అని జాన్ దోవల్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని చెప్పిన బోల్టన్ టెరరిస్టులకు నీడ ఇవ్వడం పాక్ మానుకోవాలని అన్నారు. ఇదిలా ఉంటే భారత్ గట్టిగానే జవాబు ఇస్తుందని తాను భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు పుల్వామా ఉగ్రదాడుల తర్వాత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో భారతవాయుసేన చేసిన దాడులపై అమెరికా కూడా సహకరించిం ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు జేఎన్‌యూ ప్రొఫెసర్ హ్యాపీమాన్ జేకబ్. లక్ష్యాల గురించి, ఏ సమయంలో ఎక్కడ ఎలాంటి దాడి చేయాలనే ఇంటెలిజెన్స్ సమాచారం భారత్‌కు అమెరికా ఇచ్చి ఉంటుందనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications