పైలట్ చేసిన ఆ చిన్న పొరపాటే అజిత్ పవార్ ప్రాణం తీసిందా?

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణానికి దారితీసిన విమాన ప్రమాద దర్యాప్తులో విమానయాన శాఖ ఓ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం జరగడానికి కొన్ని సెకన్ల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి అందిన ల్యాండింగ్ ఆదేశాలకు పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అధికారులు గుర్తించారు. దీనినే సాంకేతిక పరిభాషలో 'రీడ్‌బ్యాక్' (Readback) అంటారు. అసలు ఈ రీడ్‌బ్యాక్ ఎందుకు అంత కీలకం? ఆ చివరి నిమిషాల్లో ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం.

రీడ్‌బ్యాక్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?
విమానయాన రంగంలో 'రీడ్‌బ్యాక్' అనేది అత్యంత కీలకమైన భద్రతా నిబంధన. ఏటీసీ అధికారులు ఇచ్చే ఆదేశాలను పైలట్ తిరిగి అప్పగించడాన్ని లేదా ధృవీకరించడాన్ని రీడ్‌బ్యాక్ అంటారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఏటీసీ ఇచ్చే సందేశాలు పైలట్‌కు సరిగ్గా అర్థమయ్యాయా లేదా? వారు సరైన రన్‌వేను ఎంచుకున్నారా? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో వేగం, ఎత్తు, రన్‌వే క్లియరెన్స్ వంటి విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఘోర ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి, రీడ్‌బ్యాక్ తప్పనిసరి.

ajit pawar plane crash readback error Did a Pilot Error Lead to Death Investigation Reveals

బారామతి ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?
కేంద్ర విమానయాన శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఉదయం 8:18 గంటలకు విమానం బారామతి ఏటీసీతో సంప్రదింపులు జరిపింది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని, విజిబిలిటీ 3 కిలోమీటర్ల వరకు ఉందని అధికారులు పైలట్‌కు సమాచారం ఇచ్చారు. ఇది ల్యాండింగ్‌కు సరిపోతుందని నిపుణులు భావిస్తారు. అయితే విమానం రన్‌వే 11 వైపు మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు, రన్‌వే సరిగ్గా కనిపించడం లేదని పైలట్ పాఠక్ ఏటీసీకి చెప్పారు. దీంతో అధికారులు 'గో-అరౌండ్' (మళ్ళీ గాలిలోకి వెళ్లి తిరిగి రావడం) ఆదేశాలు జారీ చేశారు.

ల్యాండింగ్ క్లియరెన్స్, పైలట్ మౌనం
గో-అరౌండ్ పూర్తి చేసుకున్న తర్వాత విమానం రెండోసారి ల్యాండింగ్‌కు సిద్ధమైంది. ఈసారి రన్‌వే కనిపిస్తుందని పైలట్ ధ్రువీకరించిన తర్వాత, ఉదయం 8:34 గంటలకు ఏటీసీ అధికారులు విమానాన్ని ల్యాండ్ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చారు. విమానయాన ప్రోటోకాల్ ప్రకారం.. ల్యాండింగ్ క్లియరెన్స్ రాగానే పైలట్ ఆ విషయాన్ని తిరిగి చెప్పాలి. కానీ కెప్టెన్ శాంభవి పాఠక్ నుండి ఆ సమయంలో ఎలాంటి స్పందన రాలేదు. అంటే రీడ్‌బ్యాక్ ఇవ్వకుండానే విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించింది. కొద్ది నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది.

దర్యాప్తులో కీలకంగా మారిన 'రీడ్‌బ్యాక్' లోపం
పైలట్ నుంచి రీడ్‌బ్యాక్ రాకపోవడాన్ని దర్యాప్తు సంస్థలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయి. సాధారణంగా రూట్ క్లియరెన్స్, వేగం, ఎత్తు, ల్యాండింగ్ వంటి సందర్భాల్లో పైలట్లు కచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. పైలట్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? ఆ సమయంలో కాక్‌పిట్‌లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? లేక వాతావరణం హఠాత్తుగా మారి పైలట్ ఒత్తిడికి లోనయ్యారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. బ్లాక్ బాక్స్, వాయిస్ రికార్డర్ ద్వారా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+