బీఫ్ తినొద్దన్నందుకు అజ్మీర్ దర్గా క్లెరిక్ జైనుల్ పదవి పోయింది!
ముస్లింలు బీఫ్ తినొద్దని చెప్పినందుకు అజ్మీర్ దర్గా క్లెరిక్ జైనుల్ అబేదిన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని జైనుల్ ఖాన్ సోదరుడు అలావుద్దిన్ అలిమి బుధవారం వెల్లడించారు.
అజ్మీర్: ముస్లింలు బీఫ్ తినొద్దని చెప్పినందుకు అజ్మీర్ దర్గా క్లెరిక్ జైనుల్ అబేదిన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని జైనుల్ ఖాన్ సోదరుడు అలావుద్దిన్ అలిమి బుధవారం వెల్లడించారు. ఆయన స్థానంలో తానే బాధ్యతలు తీసుకోనున్నట్లు అలిమి ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. సోమవారం ఖ్వాజా మోయినుద్దిన్ చిస్తి 805వ వర్థంతి సందర్భంగా జైనుల్ ఖాన్ దర్గాలో మతపెద్దల సమక్షంలో ప్రసగించారు. హిందువుల ఆచారాన్ని గౌరవిస్తూ ముస్లింలు కూడా బీఫ్ తినకూడదని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జైనుల్‌ఖాన్ పిలుపునిచ్చారు.

గోసంరక్షణ కేవలం ప్రభుత్వానిదే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. అంతేకాకుండా ముస్లింలు ట్రిపుల్ తలాక్ విధానాన్ని కూడా ఆచరించవద్దని, అది పవిత్రమైన ఖురాన్‌ను వ్యతిరేకించినట్లు అవుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన, తన కుటుంబీకులు కూడా బీఫ్ తినబోమంటూ ప్రతిజ్ఞ కూడా చేశారు.












Click it and Unblock the Notifications