యూపీలో సమాజ్ వాదీ ప్రభుత్వమే- అందుకే ఆశిష్ కు హడావిడి బెయిల్-అఖిలేష్ కామెంట్స్

యూపీ ఎన్నికల ప్రచారం మూడో దశ దాటి నాలుగో దశకు చేరుకుంటోంది. రేపు మూడో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగోదశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఒకటైన లఖీంపూర్ ఖేరీలో సమాజ్ వాదీ పార్టీ ఛీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆయన గతంలో జరిగిన లఖీంపూర్ ఖేరీ ఘటనను పదే పదే ప్రస్తావిస్తూ బీజేపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

లఖీంపూర్ ఖేరీలో ఇవాళ ప్రచారం నిర్వహించిన అఖిలేష్ యాదవ్.. గతేడాది ఇక్కడ రైతులపై బీజేపీకి చెందిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడు ఆశిష్ యాదవ్ దాష్టికాన్ని గుర్తుచేశారు. గత సంవత్సరం లఖింపూర్ ఖేరీలో జరిగిన నిరసనలో రైతులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు తొందరపడి బెయిల్ మంజూరు చేశారనే విషయం బిజెపికి తెలుసని అఖిలేష్ వ్యాఖ్యానించారు. యూపీలో ప్రభుత్వం మారబోతోందని తెలుసు కాబట్టే ఆశిష్ కు తొందరపడి బెయిల్ ఇచ్చారని అఖిలేష్ విమర్శించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటే, యోగి ఆదిత్యనాథ్ కూడా వెనక్కి వెళ్ళవలసి ఉంటుందని అఖిలేష్ హెచ్చరించారు.

Akhilesh yadav questions ashish misras hurried bail in Lakhimpur Kheri rally

లఖీంపూర్ ఖేరీ ఘటన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నియోజవర్గాల్లోనూ బీజేపీపై వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అఖిలేష్.. తన ప్రచారంలో పదే పదే ఈ ఘటనను ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు బీజేపీకి ఎదురైన కారణాల్ని కూడా అఖిలేష్ ప్రచారంలో గుర్తుచేస్తున్నారు. కేవలం బ్రహ్మణుల ఓట్ల కోసమే బీజేపీ మిశ్రాకు బెయిల్ ఇప్పించిందని చెప్తున్నారు. ఇప్పటికే బ్రాహ్మణలు, జాట్ల మధ్య పోరుతో బీజేపీకి నష్టం జరగడం ఖాయమని నివేదికలు వస్తున్న నేపథ్యంలో అఖిలేష్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+