ఈ 7 బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా? -ఏప్రిల్ 1 నుంచి పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు చెల్లవు -బీ అలర్ట్
దేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. దానికి అనుగుణంగా నిబంధనలు, విధివిధానాలు కొత్తగా వచ్చాయి. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్ 1) నుంచి బ్యాంకుల విషయంలో పలు అంశాలు మారబోతున్నాయి. విలీనమైపోయిన ఆయా బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు ఇక పని చేయవు.
యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలహాబాద్ బ్యాంక్ వంటివి విలీనమయ్యాయి. ఈ బ్యాంకులకు సంబంధించిన పాస్‌బుక్స్, చెక్‌బుక్స్ ఏప్రిల్ 1 నుంచి పని చేయబోవు. చెక్ బుక్స్, పాస్‌బుక్స్ తోపాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్ వంటివి కూడా మారనున్నాయి.

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాక్ వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ వంటివి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. ఇక అలహాబాద్ బ్యాంక్... ది ఇండియన్ బ్యాంక్‌లో విలీనమైంది. బ్యాంకులు వాటి కస్టమర్లకు ఈ విషయాన్ని ఇప్పటికే సమాచారమిచ్చాయి.
విలీనం పూర్తయిన బ్యాంకుల్లో గనుక మీకు ఖాతాలుంటే, వివరాలను అప్‌డేట్ చేసుకుంటే మంచిది. కొత్త చెక్ బుక్స్, పాస్ బుక్స్ తీసుకున్న తర్వాత మీరు మీ వివరాలను ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్లలో కూడా అప్‌డేట్ చసుకోవడం మరవొద్దని, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, పీఎఫ్ అకౌంట్ వంటి వాటిల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సలహాఇస్తున్నారు.












Click it and Unblock the Notifications