• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భజరంగ్ దళ్ కార్యకర్త హత్య: నిందితులందరినీ గుర్తించాం, త్వరలో మరిన్ని అరెస్టులు: పోలీసులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో హత్యకు గురైన భజరంగ్ దళ్ సభ్యుడి అంత్యక్రియల జరిపేందుకు అనుమతించిన స్థానిక పరిపాలన విభాగంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ఊరేగింపులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హిజాబ్ వ్యవహారంతోపాటు అన్ని కోణాల్లోనూ ఈ హత్య కేసు విచారణ జరుగుతుందని రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి స్పష్టం చేశారు.

భజరంగ్ దళ్ కార్యకర్త అయిన 26 ఏళ్ల హర్ష హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. మరో 12 మందిని ప్రశ్నించారు. ఓ కారులో వచ్చిన ఓ వర్గం వ్యక్తులు హర్షను ఆదివారం రాత్రి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు.

All Accused Identified, More Arrests Soon In Karnataka Bajrang Dal activist Murder case: Police.

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ వ్యవహారం ఆంక్షలపై ఎలాంటి లింక్ లేదని కర్ణాటక ప్రభుత్వం నిన్న తోసిపుచ్చింది, అయితే రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఇలా అన్నారు.. "హిజాబ్ వ్యవహారం వెనుక ఉన్న సంస్థలు కూడా స్కానర్‌లో ఉన్నాయి, వారి పాత్రను కూడా పరిశీలిస్తున్నాం. చట్టపరమైన చర్యలుంటాయి. నిన్న రాళ్ల దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అంత్యక్రియల కోసం హర్ష మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో హింస, కాల్పులు జరిగాయి. 8 కిలోమీటర్ల అంతిమయాత్రలో 5,000 మందికి పైగా పాల్గొన్నారు.
కార్లకు నిప్పంటించారని, రాళ్లు రువ్వారని పేర్కొన్నారు. ఒక ఫోటో జర్నలిస్ట్, ఒక పోలీసు సహా కనీసం ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి.

జనాలను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగాలు, లాఠీ ఛార్జీ చేశారు. పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డాయి. పెద్ద సమూహాలను నిషేధించారు. అస్థిర పరిస్థితిలో ఊరేగింపును అనుమతించడంపై ప్రశ్నలను ఎదుర్కొన్న కర్ణాటక ప్రభుత్వం ఆ నిర్ణయానికి దూరంగా ఉంది.

"చాలా మంది సందర్శకులు రావడం చూసి, మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. ఇది జిల్లా యంత్రాంగం నిర్ణయం" అని హోం మంత్రి శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎలాంటి స్థలాన్ని అనుమతించవద్దని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా నేరస్తులను అరెస్టు చేసి వారికి తగిన శిక్ష విధిస్తుంది" అని జ్ఞానేంద్ర అన్నారు.

"ఇలాంటి హత్యలు ఆగిపోవాలి. హర్ష హత్యతో ఇది అంతం కావాలి, ఇది ప్రభుత్వం, పోలీసు శాఖ నిబద్ధత. మేము ఈ కేసును లాజికల్ ఎండ్‌కి తీసుకువెళుతున్నాము" అని మంత్రి తెలిపారు త్వరలోనే హంతకులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు.
వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే హర్షను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈశ్వరప్ప సోమవారం మాట్లాడుతూ.. హత్యకు "ముస్లిం గూండాలు" కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ కర్నాటక చీఫ్ డికె శివకుమార్ హిజాబ్ నిరసనల ఉచ్ఛస్థితిలో చేసిన వ్యాఖ్యలతో హత్యను ప్రేరేపించారని ఆరోపించారు.

English summary
All Accused Identified, More Arrests Soon In Karnataka Bajrang Dal activist Murder case: Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X