సంచలనం: కశ్మీర్ బీజేపీ మంత్రుల రాజీనామా?, కథువా ఎఫెక్ట్?

Subscribe to Oneindia Telugu

కశ్మీర్: జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలోని ఆరుగురు బీజేపీ మంత్రులు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. జాతీయ మీడియా చానెళ్లు రిపబ్లిక్ టీవి, ఎన్డీటీవి ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కథువా రేప్ ఘటనలో అరెస్టయిన నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఇద్దరు రాష్ట్ర మంత్రులు రోడ్డుపైకి రావడాన్ని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.వారి స్థానంలో కొత్తవారిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం.

All BJP Ministers In Jammu And Kashmir Government To Resign

కాగా, బీజేపీ మంత్రుల రాజీనామాను కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కూడా కొనసాగుతుందని ఆమె పేర్కొనట్టు సమాచారం. ఇదిలా ఉంటే, 2014 ఎన్నికల్లో 87స్థానాలకు గాను పీడీపీ 28స్థానాలను, బీజేపీ 25స్థానాలను గెలుచుకుని.. పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a massive political development, all the BJP ministers in the Jammu and Kashmir government have resigned

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X