కృష్ణానీరు: ప్రధానికి కిరణ్ థ్యాంక్స్, చేతులెత్తేశారని వినోద్

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అఖిల పక్ష బృందం శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయి బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివరించింది. కిరణ్ బృందం ప్రధానితో దాదాపు అరగంటపాటు భేటీ అయింది. ఈ భేటీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ పాల్గొన్నారు. అనంతరం ఆయా పార్టీల నాయకులు విలేకరులతో మాట్లాడారు.

ప్రధానమంత్రి తమ వాదనలు సావధానంగా విన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారన్నారు. ప్రధాని సానుకూలంగా స్పందించారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

All Party meet Manmohan Singh

ట్రిబ్యునల్ తీర్పుతో జరిగిన అన్యాయాన్ని తాము ప్రధానికి వివరించామని, తీర్పును గెజిట్ చేయకూడదని అడిగామని టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తీర్పును పరిశీలించాలని తాను సిడబ్ల్యూసిని కోరుతానని హామీ ఇచ్చారన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తమకు అన్యాయం జరిగిందని, రాష్ట్ర పిటిషన్‌లో ఇంప్లీడ్ కావాలని కోరామన్నారు. మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కులుండాలని, కృష్ణా జలాలపై పార్లమెంటులో చర్చ జరగాలని తాము కోరామని కోడెల శివప్రసాద్ అన్నారు.

బచావత్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చెప్పారు. తీర్పుతో రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పగా, ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును సవరించాలని కోరినట్లు రాఘవులు, జూలకంటి రంగారెడ్డి చెప్పారు. తీర్పుతో నల్గొండ, పాలమూరు జిల్లాలకు నీరు రాకుండా పోయిందని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తీర్పుపై ప్రధాని నుండి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. తాము అన్యాయం గురించి చెప్పాక పరిశీలిస్తామని, అధ్యయనం చేసి ముందుకెళ్తామని మాత్రమే చెప్పారన్నారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది కదా ఏం చేయలేమని హరీష్ రావత్ అన్నారన్నారు. ప్రధాని నుండి అంత సానుకూల స్పందన రాలేదని, ఆ మాటలతో రాష్ట్రానికి న్యాయం జరగదన్నారు.

మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్నారు. ప్రస్తుతం శాసన సభ ముందు విభజన చట్టం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీవిజన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో పోలవరం జాతీయ ప్రాజెక్టు ఉండగా, తెలంగాణలో జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. ప్రాణహిత చేవెళ్లను జాతీయ ప్రాజెక్టు చేయాలని కోరితే ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+