జమ్మూకశ్మీర్లో రేపే తొలి విడత పోలింగ్-24 సీట్లలో ఓటింగ్-ఇవన్నీ తొలిసారి..!
జమ్మూ కాశ్మీర్ గత పదేళ్లలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. రేపు (బుధవారం) 24 సీట్లలో తొలి విడత పోలింగ్ జరగబోతోంది. ఇందులో 16 నియోజకవర్గాలు కాశ్మీర్ పరిధిలోనూ, మరో 8 సీట్లు జమ్మూ పరిధిలోనూ ఉన్నాయి. మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో రేపు తొలి విడత జరగబోతోంది. ఈ నెల 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరుగుతాయి.
తొలి విడత పోలింగ్ లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ , అవామీ ఇత్తెహాద్ పార్టీ పోటీలో ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గత పదేళ్లలో ఇక్కడ జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. అలాగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కూడా ఇవే. దీంతో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది.

జమ్మూ,కశ్మీర్ లో 2014, 2019, 2024లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో జమ్మూకశ్మీర్ పరిధిలోకి వచ్చే ఐదు ఎంపీ సీట్లలో సగటున గత 35 ఏళ్లలో అత్యధికంగా 58.46 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇక్కడి ప్రజలు తిరిగా రాష్ట్ర హోదాకు అనుకూలంగా ఓటేయబోతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో రాజకీయంగా సుస్దిరత నెలకొనాలంటే ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది. దీంతో ఈసారి ఓటింగ్ శాతంపైనా ఆసక్తి నెలకొంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications