వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్వాంచల్ లో బలం ఎవరిది- ఆరో విడత పోలింగ్ కు సిద్దం: కూటములే కీలకం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఏడు విడతల పోలింగ్ లో భాగంగా చివరి రెండు విడతలు కీలకమైన పూర్వాంచల్ లో జరగనున్నాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు..ఇప్పటికే 292 సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక, ఆరో విడదతో 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తుది ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వాంచల్ లో మొత్తం 111 స్థానాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ ఎస్పీ మధ్య హోరా హోరీ పోరు సాగినట్లు కనిపించగా.. ఈ సారి మాత్రం ఈ రెండు పార్టీల కూమటులు కీలక భూమిక పోషించనున్నాయి.

ఆరో విడతలో కూటములే కీలకంగా

ఆరో విడతలో కూటములే కీలకంగా


ఆరో విడత ఎన్నికల్లో 57 స్థానాలకు 676 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అంబేడ్కర్ నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్​నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, గోరఖ్​పుర్, ఖుషీనగర్, దేవరియా, బలియా జిల్లాలకు ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యోగి కంచుకోట అయిన గోరఖ్​పుర్ లోక్​సభ స్థానాల్లోని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. భాజపా మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్​.. ఇక్కడే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పూర్వాంచల్​లో భాజపా మెరుగ్గా రాణించాలంటే ఈ రెండు పార్టీలు అధిక సీట్లను గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రెండు పార్టీలకు భాజపా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది.

యోగీ సీటు సైతం ఈ విడతలోనే

యోగీ సీటు సైతం ఈ విడతలోనే

2017లో అప్నాదళ్​కు 11 సీట్లే కేటాయించిన భాజపా.. ఇప్పుడు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. నిషాద్ పార్టీ 16 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఇక, ప్రధాన విపక్షంగా ఉన్న ఎస్పీ.. ఈ ఎన్నికల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన ముస్లిం, యాదవ్​ల ఓట్లు తమకే పడతాయని అంచనా వేసుకుంటోంది. భాజపాకు చెందిన కీలక ఓబీసీ నేతలు ఎస్పీలోకి చేరిన నేపథ్యంలో.. ఈ వర్గం ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు పోటీలో వెనుకంజలో ఉన్నారనే అభిప్రాయం బీఎస్పీ మీద ఉంది. కానీ, ఈ విడతలో బీఎస్సీ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. భారీ సంఖ్యలో జాతవ్​ల ఓట్లను బీఎస్పీ దక్కించుకోవచ్చని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended Video

UP Elections 2022: రంగంలోకి Star Campaigners|BJP VS SP VS Congress | Oneindia Telugu
పూర్వాంచల్ పై పట్టు దక్కేదెవరికి

పూర్వాంచల్ పై పట్టు దక్కేదెవరికి


2.14 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 స్థానాల్లో భాజపా కూటమి మొత్తం 46 స్థానాల్లో విజయం సాధించింది. ఆరో విడతలో బరిలో ఉన్న ప్రముఖుల్లో యోగి ఆదిత్యనాథ్- యూపీ ముఖ్యమంత్రి- గోరఖ్​పుర్ అర్బన్కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ- తమ్కుహీ రాజ్మాజీ మంత్రి, ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య-ఫాజిల్​నగర్అసెంబ్లీలో విపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి- బాంసిడీ నుంచి బరిలో నిిచారు. మంత్రులు సూర్యప్రతాప్ షాహీ, సతీశ్ చంద్ర ద్వివేది, జైప్రతాప్ సింగ్, శ్రీరాం చౌహాన్, జైప్రకాశ్ నిషాద్ ఈ విడతలో బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్.. గోరఖ్​పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్​కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఇక, చివరి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనూ ప్రచారం ముమ్మరం చేసారు. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

English summary
In the UP sixth phase, 57 assembly constituencies from 10 districts are witnessing elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X