ఇక జియో ఫోన్లు బంద్.. జియో కొత్తఎత్తుగడ, ఏమిటంటే..
ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ముంబై: రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టెలికాం మార్కెట్‌లో ప్రధాన పోటీదారులైన ఎయిర్ టెల్, వొడాఫోన్‌లకు షాకిచ్చేలా జియో పావులు కదుపుతోంది.
ఉచిత ఆఫర్లు, ఉచిత డేటా ఆఫర్లతో ప్రత్యర్థి కంపెనీలకు గుబులు పుట్టించిన జియో ఇపుడు తన గేమ్‌ప్లాన్‌ను మార్చింది. ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా జియో ఫీచర్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా సైట్ల సపోర్టు లేకపోవడంతో తాజాగా ఆండ్రాయిడ్ ఫోన్లను ఉచితంగా అందించనుందని సమాచారం. అన్ని సోషల్ మీడియా యాప్‌ల మద్దతుతో ఈ ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జియో ఫీచర్ ఫోన్ ఉత్పత్తిని నిలిపివేసి ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించిందనీ ఒక నివేదిక వెల్లడించింది. అంతేకాదు ఫేస్‌బుక్, గూగుల్‌లాంటి సంస్థలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా చేపట్టినట్టు నివేదించింది.
మరోవైపు ఆండ్రాయిడ్ ఫోన్ అంచనాలను జియో ప్రతినిధి తిరస్కరించలేదు..కానీ, త్వరలోనే జియో ఫోన్ బుకింగ్ తేదీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇండియా కా స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
జియో ఫోన్ బుక్ చేసుకున్న 60 లక్షల భారతీయులను స్వాగతించిన ఆయన జియోఫోన్ తదుపరి బుకింగ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications