సీఎం కాన్వాయ్ రాకతో అంబులెన్స్‌ను ఆపేశారు: చిన్నారి తల్లి వేడుకున్నా కనికరించలేదు
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం అంబులెన్స్‌ను నిలిపివేయడంతో తన బిడ్డను కాపాడాలంటూ ఓ తల్లి ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలని.. తమను తొందరగా పంపించాలని పోలీసులను వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు. సుమారు గంటకుపైగా అంబులెన్స్‌ను నిలిపివేశారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.
బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీశ్ కుమార్ శనివారం నలందాలో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం కాన్వాయ్‌లో పాట్నాకు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో సీఎం కాన్వాయ్ వెళ్లిపోయే వరకు అంబులెన్స్ ట్రాఫిక్‌లో ఉండటంతో వారు గంటపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో అనారోగ్యంతో ఉన్న ఆ బిడ్డ స్పృహ కోల్పోయాడని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కాగా, అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులను ఆ మహిళ ప్రాధేయపడింది. అయితే పసిపాప పరిస్థితి చూసినప్పటికీ అంబులెన్స్ వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో సుమారు గంటపాటు అంబులెన్స్ అక్కడే నిలిచిపోయిది. మరోవైపు పసిపాప అచేతనంగా ఉండటం చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె బోరున ఏడ్చింది.
बिहार के सीएम नीतीश के काफिले ने एम्बुलेंस को रोका #nitishkumar #bihar #ambulance #viralvideo #nextindiatimes pic.twitter.com/476rNzx1iL
— NEXTINDIATIMES-NIT (@nextindiatimes) September 30, 2023
నెల రోజుల క్రితం కూడా బీహార్ రాష్ట్రంలో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడు అంబులెన్స్‌ను ఆపిన పోలీసులను గుర్తించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.












Click it and Unblock the Notifications