కేసుల్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు చుక్కలే ! సుప్రీంకు అమికస్ క్యూరీ కీలక సిఫార్సులు-ఆదేశాలే లేటు !

దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై గతంలో నమోదైన పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ఈ కేసుల్ని విచారించకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్ధపై జనంలో నమ్మకం సడలిపోతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సహాయకుడి(అమికస్ క్యూరీ)గా ఉన్న న్యాయనిపుణుడు విజయ్ హన్సారియా అత్యున్నత న్యాయస్ధానానికి కీలక సూచన చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు విచారించాకే మిగతా కేసులు విచారించేలా దిగువ కోర్టుల్ని ఆదేశించాలని సూచించారు.

 ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు

ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ట్రయల్ కోర్టులు, హైకోర్టుల్లో భారీ సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించే లోపే మిగతా కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. దీంతో కోర్టులపైనా ఒత్తిడి పెరిగిపోయి వాటిని మధ్య మధ్యలో విచారిస్తున్నాయి. ఈ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతుండటంతో కోర్టులపై, ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. అలాగే ఈ కేసుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇవేవీ పట్టించుకోకుండా జనంలోకి వెళ్తున్నారు. వాళ్లు కూడా వారిని మళ్లీ మళ్లీ ఎన్నుకుంటున్నారు. ఓసారి ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులపై తీర్పులు వెలువడితే జనానికి కూడా క్లారిటీ వస్తుంది. దీంతో ఈ కేసుల విచారణపై సుప్రీంకోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) సలహా కోరింది.

ఆ కేసులపైనే ముందు విచారణ

ఆ కేసులపైనే ముందు విచారణ


దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదై విచారణ ముందుకు సాగకుండా పెండింగ్ లో ఉన్న కేసులపైనే ముందుగా విచారణ సాగించేలా ట్రయల్ కోర్టుల్ని, హైకోర్టుల్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియీ సలహా ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లోని ట్రయల్ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల్ని మిగతా కేసుల కంటే ముందు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అలాగే ఐదేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న ఇలాంటి కేసులపై ఫాస్ట్ ట్రాక్ విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.

 వివరాలు పంపని 9 హైకోర్టులు

వివరాలు పంపని 9 హైకోర్టులు


ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులపై విచారణ తాజా పరిస్ధితిపై సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్ని గతంలోనే ఆదేశించింది. అయితే దేశంలో 16 హైకోర్టులు మాత్రమే ఈ వివరాలు ఇచ్చాయి. తెలంగాణ సహా 9 హైకోర్టులు ఈ వివరాలు ఇవ్వలేదని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలిపారు. దీంతో ఆయా హైకోర్టులు కూడా వెంటనే ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

ఫాస్ట్ ట్రాక్ విచారణకు సిఫార్సులివే

ఫాస్ట్ ట్రాక్ విచారణకు సిఫార్సులివే

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ ఫాస్ట్ ట్రాక్ లో సాగేలా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు కీలక సిఫార్సులు చేశారు. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని ట్రయల్ కోర్టులు ముందుగా విచారించేలా, అందుకు హైకోర్టులు తగిన ఆదేశాలు ఇచ్చేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ కేసుల విచారణ అత్యవసరమైతే తప్ప వాయిదాలకు అనుమతించకూడదు, లాయర్లు సహకరించాలి, అసాధారణ పరిస్ధితుల్లో వాయిదా పడితే వాటి వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి తగు ఆదేశాలివ్వాలి. ట్రయల్ జాప్యానికి నిందితులు కారణమైతే వారి బెయిల్ రద్దు చేయాలి. మరణశిక్ష, ఏడేళ్లకు పైగా శిక్షలకు అర్హత ఉన్న కేసుల విచారణ ముందుగా చేపట్టాలి. ఫోరెన్సిక్ అంశాల్లో ల్యాబ్ లు అత్యవసరంగా రిపోర్టులు పంపాలి. కోర్టు కోరిన రోజు నిందితుల్ని హాజరుపర్చకపోతే పోలీసులకు నాన్ బెయిలబుల్ వారంట్లు పంపాలి. నిందితులు, సాక్ష్యుల్ని కోర్టుల ముందు హాజరుపర్చని పోలీసుల నుంచి కోర్టులు వివరణ కోరేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అమికస్ క్యూరీ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+