ఒమిక్రాన్ భయాల మధ్య క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం; ఢిల్లీ సర్కార్ కీలక ఉత్తర్వులు
దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలకు, సెలబ్రేషన్స్ చేసుకోవడానికి దూరంగా ఉండాలని, జన సమూహం ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు అనుమతులు లేవని వెల్లడించింది. బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Recommended Video

క్రిస్మస్ , న్యూ ఇయర్ వేడుకలపై ఢిల్లీలో నిషేధం
కోవిడ్ -19 యొక్క ఒమిక్రాన్ వేరియంట్ నుండి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎటువంటి ఈవెంట్‌లు లేదా సమావేశాలను నగరంలో అనుమతించబోమని పేర్కొంది. డిడిఎంఎ డిసెంబర్ 15 నాటి ఉత్తర్వుల ప్రకారం, అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు నిషేధించబడ్డాయని, ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని వెల్లడించింది. ఢిల్లీలో క్రిస్మస్ లేదా నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు,సమావేశాలు, సమ్మేళనాలు జరగకుండా అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు మరియు డిసిపిలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
అనేక సందర్భాల్లో కోవిడ్ నిబంధనలను విపరీతంగా ఉల్లంఘించడం మరియు అవసరమైన పరిమితులు పాటించడం లేదని పేర్కొన్న ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌లు అలాగే అన్ని జిల్లాల డిసిపిలు వారి సంబంధిత ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేయాలని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ మెషినరీని పటిష్టపరచాలని మరియు బహిరంగ ప్రదేశాలలో అత్యంత జాగరూకతతో ఉంచడానికి తగిన సంఖ్యలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించింది.

ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరిందన్న కేంద్రం
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. అంతేకాదు ఆ 54 మందికి 18 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అని కూడా ఆయన తెలిపారు. ఏదిఏమైనా విపరీతంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఒమిక్రాన్ కేసుల పెరుగుదల .. ఇప్పటికే చర్యలు మొదలెట్టిన ఢిల్లీ సర్కార్
ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు పూర్తిగా టీకాలు వేసిన వారికి బూస్టర్ డోసులు వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి అనుమతినివ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని అభ్యర్థించారు.

బూస్టర్ డోస్ ఇవ్వటానికి కేంద్రాన్ని అనుమతి కోరిన ఢిల్లీ సర్కార్
ఢిల్లీలో బూస్టర్ డోస్ డ్రైవ్ ప్రారంభించడానికి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, కేంద్రం అనుమతి ఇస్తే, ప్రభుత్వం డ్రైవ్‌ను ప్రారంభించి, మొదట ఆరోగ్య కార్యకర్తలందరికీ, తరువాత ఇతరులకు బూస్టర్ షాట్‌లను ఇస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అంతేకాదు భారతదేశంలోని ఓమిక్రాన్ కేసుల సంఖ్య 215కి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications