వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ఓపెన్ మైండ్‌తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాం

|
Google Oneindia TeluguNews

సంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరడం, చర్చల కోసం ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల నుంచి తొలగించవలసిన, వాటికి చేర్చవలసిన అంశాలేమిటో ప్రభుత్వానికి తెలియజేయాలంటూ రాసిన లేఖలపై రైతు సంఘాలు స్పందించాయి.

కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్కరోనా వ్యాక్సిన్‌లో పంది మాంసం ఉన్నా పర్వాలేదు -ముస్లింలకూ అది ఔషధమే -ఇస్లామిక్ ఫత్వా కౌన్సిల్

Recommended Video

రైతు సంఘాల స‌మావేశం : ఆందోళ‌న‌ను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర : రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాలు తిరస్కరించాయి. ఓపెన్ మైండ్ తో, నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని నేతలు విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం(వ్యవసాయ శాఖ) రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు. అనంతరం సాయంత్రం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

amid tomar comments, farmers Ready For Talks, asks Govt To Come With Open Mind

చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామని రైతు సంఘాల నేతలు చెప్పారు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అవాస్తవమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి.

జగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామజగన్‌ పరువు గంగలోకి -రంగు పడుద్ది -వైసీపీకి వేల కోట్లు ఎక్కడివి? రక్త దోపిడీ ఏంటయ్యా?: ఎంపీ రఘురామ

కేంద్రం రాతపూర్వక హామీలతో రావాలని కోరుతున్నట్టు రైతులు చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలన్నారు. ఇలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామన్నారు. చర్చలు సక్సెస్ అయ్యేలా అనుకూల వాతావరణాన్ని కేంద్రమే సృష్టించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు చర్చలకు విముఖత చూపుతున్నారు.

అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

English summary
Farmers protesting the centre's new agricultural reforms on Wednesday said they are ready to hold talks but are waiting for the government to hold discussions with an open mind and present concrete proposals that are acceptable. "Farmer unions are ready to talk to the government. We are waiting for the government to come to the table with an open mind. We urge the government to not repeat amendments we have rejected but come up with concrete proposals in writing," Yogendra Yadav, the leader of Swaraj India, one of the protesting groups, said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X