జోరు మీదున్న కేజ్రీవాల్: గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ సామాజిక వర్గ నేత పేరు ఖరారు

పనాజీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే వెలువడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌‌‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.

ఏడు దశల్లో..

ఏడు దశల్లో..

తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఆ రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేటతెల్లమౌతోంది.

గోవాలో ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ..

గోవాలో ఊపుమీదున్న ఆమ్ ఆద్మీ..

గోవాలో ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. 40 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం అది. ఇప్పుడక్కడ పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు సర్వేలు స్పష్టం చేసిన నేపథ్యంలో- అదే ఊపుతో గోవాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలుకోవడానికి సిద్ధంగా లేదా పార్టీ.

అమిత్ పాలేకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా..

అమిత్ పాలేకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా..

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును వెల్లడించిన మరుసటి రోజే- ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక ప్రకటన చేశారు. గోవా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును వెల్లడించారు. అమిత్ పాలేకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. రాజధాని పనాజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని తెలిపారు. భండారీ సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకు గోవాలో అధికంగా ఉంది. 40 శాతం జనాభా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే.

కొత్త వారికి టికెట్లిచ్చాం..

కొత్త వారికి టికెట్లిచ్చాం..

అందుకే అదే కమ్యూనిటీకి చెందిన అమిత్ పాలేకర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి తీసుకొచ్చారు కేజ్రీవాల్. గోవా ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలు విసిగి పోయారని, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కుంటున్నారని చెప్పారు. తమ పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల అనంతరం గోవాలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నామని అన్నారు.

భండారి సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం..

భండారి సామాజిక వర్గానికి న్యాయం చేస్తాం..

సామాన్యులకు టికెట్లు ఇచ్చామని, ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయని వారికి రాజకీయ అవకాశాన్ని కల్పించామని చెప్పారు. అదే తమను గెలిపిస్తుందనే ధీమాను కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా మేలు చేయాలని తపన పడే వారిని ఎన్నికల బరిలో దింపామని పేర్కొన్నారు. 1961లో గోవా ఆవిర్భవించిన తరువాత ఇప్పటివరకూ రెండున్నర సంవత్సరాల కాలం మాత్రమే భండారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పని చేశారని, ఇది అన్యాయమని కేజ్రీవాల్ అన్నారు. అందుకోసమే తాము అమిత్ పాలేకర్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆమోదించామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+