వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి మల్టీపర్పస్ ఐడీ కార్డుల ప్రస్తావన , హోంమంత్రి అమిత్ షా ప్రకటన.

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మదిలో మరోసారి యూనిక్ మల్టిపర్పస్ ఐడీ కార్డు ప్రస్తావన మెదిలింది. దీంతో గతంలో ఉన్న యూనిక్ ఐడి ప్రతిపాదనలపై మాజీ ఉప ప్రధాని ఎల్‌.కే అద్వానీ రూపోందించిన ప్రణాళికను ప్రభుత్వం పునరిద్దంచేందుకు యత్నిస్తున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే మల్టిపర్పస్ ఉపయోగం కోసం ఓటర్ ఐడీ నుండి పాన్‌కార్డు పాస్‌పోర్టు వరకు ఒకే కార్డును తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. కాగా ఇది రానున్న జనాభ లెక్కల్లో భాగంగా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు.

ఢిల్లీలోని రిజిస్టర్ జనరల్ కార్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంలో పాల్గోన్న అమిత్ షా ఈ ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు దానికి సంబంధించిన ప్రణాళిక లేకపోయినా... భవిష్యత్‌లో మల్టిపర్పస్ కార్డును తీసుకువచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.ఈ అంశంపై చాల రోజులుగా బీజేపీ ప్రభుత్వ హయాంలో మంతనాలు జరిగాయి. అనంతరం ఆ ప్రస్తావన మూలనపడింది. అయితే తాజగా 2021 జనభా లెక్కల్లో బాగంగా దీన్ని రూపోందించే అవకాశాలు ఉన్నట్టు ఆయన ప్రకటించారు.

Amit Shah on multi-purpose ID cards, he says it is a possibility

ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా పౌరుల జాబితా రూపోందిస్తామని అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పౌరుల జాబితాను రూపోందించిన అనంతరం ఈ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మొబైల్ యాప్ ద్వార జనాభ లేక్కలను సేకరిస్తామని ఆయన చెప్పారు. దీంతో జనన మరణాలకు సంబంధించిన దృవికరణ కూడ వెంటనే జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Amit Shah says of a multi-purpose ID cards is a possibility.he gave a signal that the government could revive a plan conceived by former deputy prime minister LK Advani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X