ఎస్పీ, కాంగ్రెస్ ఉగ్రవాదులు-యూపీని తీవ్రవాదుల స్వర్గంగా మార్చారు-అమిత్ షా నిప్పులు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీనీ, యోగీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్సీ వంటి పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో బీజేపీ నేతలు కూడా ఎస్పీ, కాంగ్రెస్ పై మాటల దాడి ముమ్మరం చేశారు.
గతంలో యూపీని పాలించిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా నిప్పులు చెరిగారు. వీరిద్దరూ కవచం వేసుకున్న ఉగ్రవాదులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి యూపీని ఉగ్రవాదుల స్వర్గంగా మార్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సీతాపూర్, బారాబంకీలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న అమిత్ షా.. ఎస్పీ, కాంగ్రెస్ యూపీని ఉగ్రవాదులకు అడ్డాగా, కారిడార్ గా, హాట్ స్పాట్ గా మార్చేశాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2008 నాటికి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ గుజరాత్ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు తర్పాత ఈ రెండు పార్టిలపై బీజేపీ తీవ్రవాద ముద్రతో ఎదురుదాడి చేస్తోంది.

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పైనా అమిత్ షా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అఖిలేష్ రాజకీయాలన్నీ తీవ్రవాదంతో, మత ఘర్షణలతో ముడిపడి ఉంటాయన్నారు. గతంలో అఖిలేష్ ప్రభుత్వం.. ఖాలిద్ ముజాహిద్, హకీమ్ తారీఖ్ కస్మీ వంటి ఉగ్రవాదుల్ని విడిచిపెట్టిన విషయాన్ని అమిత్ షా గుర్తుచేశారు.
వారణాసి సంకట్ మోచన్ గుడిలో, అయోధ్య రామజన్మభూమిలో, లక్నో కోర్టులో గతంలో అఖిలేష్ హయాంలో జరిగిన పేలుళ్లను సైతం షా గుర్తుచేశారు. తీవ్రవాది ముజాహిద్ గుండెపోటుతో చనిపోతే అఖిలేష్ సర్కార్ 42 మంది పోలీసు అధికారులపై కేసులు పెట్టిందన్నారు. మరోవైపు తీవ్రవాదాన్ని అరికడతామన్న కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా మాటల్ని కూడా ఫాల్తూ బాత్ అంటూ అమిత్ షా కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications