థ్యాంక్ గాడ్, గెలిచాం: సోనియా, పరువు పోరులో అమిత్ షా ఓటమి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. ప్రధాని మోడీ - బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎత్తులు చిత్తయ్యాయి. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచారు.

ఎస్! ఇది నిజం: అహ్మద్ పటేల్ గెలుపు, కాంగ్రెస్‌కు చివరి హెచ్చరిక

ఉత్కంఠ భరిత పోరులో అహ్మద్ పటేల్ గెలిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఊపిరి పీల్చుకున్నారు. గెలుపు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

కృతజ్ఞతలు

కృతజ్ఞతలు

ఎన్నికల సంఘం నిర్ణయం పట్ల దేవుడికి కృతజ్ఞతలు అన్నారు. అహ్మద్ పటేల్ విజయంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. గొప్ప ఊరట లభించిందన్నారు. గుజరాత్ పరిస్థితులపై తాను స్పందించాలనుకోవడం లేదని, ఇప్పటికే సహచరులు దీనిపై మాట్లాడారని చెప్పారు.

Rajya Sabha Elections : After Winning Ahmed Patel's next target is...
ప్రతిష్టాత్మక పోరు.. పటేల్ ముందు ఓడిన అమిత్ షా వ్యూహం

ప్రతిష్టాత్మక పోరు.. పటేల్ ముందు ఓడిన అమిత్ షా వ్యూహం

గుజరాత్ ఎన్నికల్లో అమిత్ షా, స్మృతి ఇరానీ సులభంగా గెలిచారు. బిజెపి మూడో అభ్యర్థి మాత్రం అహ్మద్ పటేల్ చేతిలో ఓడిపోయారు. ఇది బిజెపికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నప్పటికీ వారిని.. అహ్మద్ పటేల్‌కు ఓటు వేయకుండా చేయాలనుకున్నారు. కానీ అంతగా విజయం సాధించలేదు. ఇద్దరు అభ్యర్థులు ఓటును చూపిస్తూ వేశారు. వారివి చెల్లలేదు. దీంతో విజయానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 45 నుంచి 44కు తగ్గింది. పటేల్‌కు 44 ఓట్లు వచ్చాయి. దీంతో ఆన గెలుపొందారు.

నాటకీయ పరిణామాలు

నాటకీయ పరిణామాలు

ఈ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లెక్కింపు సందర్భంగా బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా కొనసాగింది. అహ్మద్‌ పటేల్‌ విజయం సాధించినట్లు తెల్లవారుజామున ప్రకటించారు. తొలుత, తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగుకు పాల్పడిన దృష్ట్యా వారి ఓట్లను రద్దు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. దీంతో లెక్కింపు ప్రక్రియకు అవరోధం ఎదురయింది. వారి ఓట్లు రద్దు చేసినట్లు ఈసీ ప్రకటించింది.

176 మంది ఓట్లు

176 మంది ఓట్లు

మళ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్ల గోప్యత విషయంలో బిజెపి అభ్యంతరాలు లేవనెత్తడంతో లెక్కింపు మళ్లీ ఆగిపోయింది. మళ్లీ కాసేపటికి లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 176 మంది శాసనసభ్యులూ ఓట్లు వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It's for the first time Bharatiya Janata Party (BJP) president Amit Shah is going to enter Parliament as a Rajya Sabha member of Parliament (MP) after he registered a comfortable victory in the Gujarat Rajya Sabha elections, the votes for which were polled on Tuesday.
Please Wait while comments are loading...