పట్టపగలు బ్యాంకులో 20 కేజీల బంగారు నగలు లూటీ: ఒక్క ఇటుక విసిరేస్తే !
పట్టపగలు బ్యాంకులో చొరబడిన దుండగులు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేశారు. బ్యాంకు నుంచి చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఉద్యోగి చేసిన చిన్న పనికి దుండుగులు తోక ముడిచారు.
బెంగళూరు: పట్టపగలు బ్యాంకులో చొరబడిన దుండగులు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేశారు. బ్యాంకు నుంచి చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఉద్యోగి చేసిన చిన్న పనికి దుండుగులు తోక ముడిచారు.
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని తలపాడి పట్టణంలోని కేసీ రోడ్డులో కోటేకర్ వ్యవసాయ సేవా సహకార బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో అనేక మంది రైతులు వారి బంగారు నగలు కుదవపెట్టి రుణం తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

శుక్రవారం పట్టపగలు బ్యాంకులోకి ముసుగులు వేసుకున్న దుండగులు చొరబడ్డారు. మారణాయుధాలతో బ్యాంకు ఉద్యోగులను బెదిరించారు. వెంటనే లాకర్ లో ఉన్న కోట్ల రూపాయల విలువైన 20 కేజీల బంగారు నగలు ఓ బ్యాగ్ లో వేసుకున్నారు.
దండగులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో బ్యాంకు ఉద్యోగి సమీపంలోని ఓ ఇటుక తీసుకుని దుండగుల మీదకు విసిరాడు. ఆ సందర్బంలో హడలిపోయిన దుండగులు బంగారు నగలు ఉన్న బ్యాగ్ అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. బ్యాంకు వ్యవహారాలు మొత్తం తెలిసిన వారే దోపడీకి ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications