చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతనో పోలీసు ఉన్నతాధికారి, రైలు బోగిలో నగదు,నగల తో దొరికాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు అక్రమార్కులు అనేక మార్గాలను అవలంభిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధనాన్ని ఇతర మార్గాలకు తరలించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ రకమైన ప్రయత్నంలోనే ఓ వ్యక్తి సబిఐ అధికారులకు చిక్కాడు. అయితే పెద్ద ఎత్తున బంగారం, నగదును తీసుకెళ్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాడు ఓ పోలీసు ఉన్నతాధికారి.

ఎలా కూడబెట్టాడో తెలియదు.. తన వద్ద ఉన్న ధనాన్ని మార్పిడిచేసుకొనేందుకు ఓ పోలీసు అధికారి ప్లాన్ చేశాడు. ముందుగా తాను నిర్థేశించుకొన్న ప్రాంతానికి నగదును, బంగారాన్ని తరలించాలని భావించాడు. అందుకే పెద్ద పథకాన్ని సిద్దం చేసుకొన్నాడు. తనకున్న అధికారంతో కరెన్సీ కట్టలు, బంగారాన్ని తరలించేందుకు రాజమార్గాన్ని ఎంచుకొన్నాడు.

 an egmore railway station cbi officers seized special trainbox

ప్రత్యేక రైలు బోగి బుక్

ఆర్ పిఎఫ్ ఐజీ గా పనిచేస్తోన్న పారి రైలులో ప్రత్యేకమైన బోగిని బుక్ చేసుకొన్నాడు. ఈ బోగిలో బంగారం , నగదు దొరికింది ఒడిశా రాష్ట్రానికి చెందిన పారి చెన్నైలో పనిచేస్తున్నాడు. ఐసిఎప్ లో ఆయన భద్రతాధికారిగా పనిచేస్తున్నాదు.రైలులో ప్రత్యేక ఎసి బోగిని బుక్ చేసుకొన్నాడు. ఈ బోగిలో నగదును, బంగారం దొరికింది.

చెన్నైలోని ఎగ్మూర్ రైల్వేస్టేషన్ లో ఈ రైలును నిలిపి గాలించగా బోగిలో నగదు, బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా సిబిఐ అధికారులు ఈ బోగిని సీజ్ చేశారు. బోగిలో నోట్ల కట్టలను, బంగారాన్ని తరలిస్తున్న రైల్వే భద్రతాధికారిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు.అయితే ఈ నగదు, బంగారం ఎవరివి ఈ బోగిలోకి ఎలా వచ్చాయి,ఈ నగదు అంతా పోలీసు అధికారిదేననా అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు సబిఐ అధికారులు.

English summary
an egmore railway station cbi officers seized special trainbox. rpf ig pari booked special ac trainbox.he travel chennai to hourah train.accurate information cbi seized a special train box. in that special train box huge currencym ornaments,cbi officered enquired the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X