భార్య, కూతుర్ని చంపేసి మాజీ సైనికుడు ఏం చేశాడంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో !
చెన్నై/మదురై: తమిళనాడులోని మదురైలోని (madurai) సర్వేయర్ కాలనీ ఆవిన్ నగర్ లో మాజీ సైనికుడు రమేష్ (41) నివాసం ఉంటున్నాడు. సైన్యంలో ఉద్యోగం (soldier) చేస్తూ రిటైడ్ అయిన రమేష్ తరువాత మదురై చేరుకుని అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి రమేష్ స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
గత రెండు రోజులుగా రమేష్ ఇంటి తలుపులు వేసి ఉండడంతో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మదురైలోని తిరుప్పలై పోలీసులు రమేష్ ఇంటి దగ్గరకు చేరుకుని ఆయన ఇంటి తలుపులు కొట్టినా ఎవరూ తెరవకపోవడంతో ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు.

ఇంటిలోకి వెళ్లిన పోలీసులు హడలిపోయారు. రమేష్ తో పాటు ఆయన భార్య (wife) విశాలిని (36), కుమార్తె (daughter) రమీజా జస్బెల్ (12) తమ బెడ్‌రూమ్‌లో శవమై పడి ఉండడం చూసిన పోలీసులు, బందువులు షాక్‌కు గురయ్యారు. ముగ్గురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
అనంతరం రమేష్, ఆయన భార్య (wife) విశాలిని, వీరి కుమార్తె మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మధురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ మాజీ సైనికుడు (soldier) ఉద్యోగం చేసే సమయంలో సెలవుల మీద వచ్చి ఆయన భార్య విశాలిని, కుమార్తెతో కలిసి చాలా సంతోషంగా జీవించి మళ్లీ ఉద్యోగానికి (soldier) వెళ్లేవాడని ఆయన బంధువుల పోలీసులకు చెప్పారు.
ఆర్మీలో (soldier) స్వచ్చందంగా పదవి విరమణ చేసిన రమేష్ తరువాత మదురై (madurai) చేరుకుని భార్య విశాలిని, కుమార్తెతో పాటు బందువులతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు అన్నారు. బంధువులు, స్నేహితుల సూచనతో వ్యాపారం చెయ్యాలని అనుకున్న రమేష్ తరువాత రియల్ ఎస్టేట్ (real estate)వ్యాపారంలో దిగాడని పోలీసులు తెలిపారు.

కొంతకాలంగా రమేష్ రియల్ ఎస్టేట్ (real estate)వ్యాపారంలో భారీగా నష్టపోయాడని, దీంతో భారీగా అప్పులు చేసిన రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రుణ సమస్యలతో మాజీ సైనికుడి కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న ఘటన మదురై ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అయితే రమేష్, ఆయన భార్య ఆత్మహత్య చేసుకునే ముందు ఏమైనా డెత్ నోట్ రాశారా ? అని ఆరా తీస్తున్నామని, కేసు విచారణలో ఉందని మదురై పోలీసు అధికారులు తెలిపారు. అప్పులు ఇచ్చిన వాళ్లు రమేష్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారని, రుణం తీర్చడానికి వేరే (real estate) మార్గం లేకపోవడంతో వేరే మార్గం లేక భార్య, కుమార్తెతో కలిసి రమేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు అంటున్నారు.












Click it and Unblock the Notifications