
Crime: దానికి అడ్డంగా ఉన్నాడని భర్తను చంపిన భార్య.. పోలీస్ స్టేషన్‍కు వెళ్లి ఏం చేసిందంటే..!
ఇద్దరు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఇంతలో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు కాస్త హత్యకు దారి తీశాయి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. కృష్ణ కుమారి అనే యువతి స్పాలో బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. ఈమెకు సెలూన్ షాపులో పనిచేస్తున్న సంతోష్ ధామి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ మారింది. దీంతో వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవలు తలెత్తాయి.

రాడ్ తో
కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో సంతోష్.. కృష్ణ కుమారిపై తలపై రాడ్ తో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఘటన స్థలికి చేరుకున్న ఆమె స్నేహితురాలు కృష్ణ కుమారిని ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే కుమారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రియుడితో కలిసి
మరొక షాకింగ్ సంఘటనలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. కర్ణాటకలోని సోలదేవనహళ్లిలో దాసేగౌడ, జయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. దాసేగౌడ ఇంటిలో లేని సమయంలో ఒక యువకుడు అతని ఇంటికి వచ్చేవాడు. దీంతో ఆమెకు ఆ యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం దాసేగౌడకు తెలియడంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

నవంబర్ 25
నవంబర్ 25న దాసేగౌడ, జయకు మధ్య గొడవ జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను కడతేర్చాలని జయ నిర్ణయించుకుంది. అదే రోజు రాత్రి ప్రియుడిని పిలిపించి హత్య చేసింది. మృతదేహాన్ని సోలదేవనహళ్లి సమీపంలోని మైసూరు-బెంగళూరు రహదారిలో మోరీ గుంతలోకి పడేశారు. ఆ తర్వాత జయ తన భర్త కనిపించడం లేదని నవంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాల్‌డేటా
కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయ, కాల్ డేటా పరిశీలించారు. ఆమె కాల్ డేటాలో యువకుడికి వందసార్లు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరు కలిసి హత్య చేశామని ఒప్పుకున్నాడు.దీంతో జయ, యువకుడి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జయ, ఆ యువకుడి కాల్‌డేటాను సేకరించి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని దాసేగౌడను హత్యచేసినట్లు అంగీకరించారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పెళ్లి ముసుగులో దొంగతనం
బసవేశ్వరనగర్‌లో ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని ప్రదీప్‌గా అనే యువకుడు మోసం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి ఆమె వద్ద నుంచి రూ. 15 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. కేసు నమోద చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.