Viral Video: ఐడియా అదిరిపోయింది గురూ.. కదిలే డైనింగ్ టేబుల్.. వీడియో వైరల్..
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోలో కదిలే డైనింగ్ టేబుల్ ఉంది.
నలుగురు వ్యక్తుల బృందం ఫ్యూయల్ పంప్‌లో భోజనం చేస్తూ ఆనందిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. పంప్ సహాయకుడు వచ్చి ఇంధనాన్ని నింపుతాడు. ఒక సెకనులో, ఒక వ్యక్తి కిక్ టేబుల్‌ను ప్రారంభిస్తాడు. వారి టేబుల్ రోడ్డుపై కదలడం ప్రారంభిస్తుంది.
ఆనంద్ మహీంద్రా ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "నా ప్రకారం ఇది ఇ-మొబిలిటీ. ఇందులో E అంటే Eat. అని మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు విశేషమైన స్పందన వస్తుంది.ఇప్పటివరకు ఈ వీడియోను 12 లక్షల మందికి పైగా చూశారు.

I guess this is e-mobility. Where ‘e’ stands for eat… pic.twitter.com/h0HKmeJ3AI
— anand mahindra (@anandmahindra) July 3, 2022
అదే సమయంలో, 37,000 మంది లైక్ చేశారు. 4,157 మందికి పైగా రీట్వీట్ చేశారు. ప్రతిభను తట్టి లేపడంలో ఎప్పుడూ ముందుండే ఆనంద్ మహీంద్రా ఇంతకు ముందు చాలా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications