కలకలం: ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా!

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: ఆనందీ బెన్ పటేల్ సోమవారం నాడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆనందీ బెన్ పటేల్ రాజీనామాతో రాజకీయ కలకలం చెలరేగింది. తనకు ఆరోగ్యం మీద పడిందనే కారణంతో ఆమె బీజేపీజాతీయ అధ్యక్షులు అమిత్ షాకు రాజీనామాను సమర్పించారు.

ఆమె బీజేపీ అధ్యక్షుడికి రాజీనామా పంపినంత మాత్రాన సీఎం పదవికి రాజీనామా చేసినట్లు కాదు. ఆమె రాజీనామా సమర్పించడం పైన అమిత్ షా స్పందించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి, ఆమె రాజీనామా పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

Anandiben Patel resigns as Gujarat chief minister

కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లో నలుగురు దళితులను గోరక్షక దళ్ చితకబాదిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం అట్టుడుకుతోంది. అహ్మదాబాదులో దళితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాష్ర ప్రభుత్వం నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితల పై దాడి నేపథ్యంలో ఆనందీ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Gujarat CM offers to resign
English summary
Gujarat chief minister Anandiben Patel has submitted her resignation after a week of protests across the state following the assault on four Dalits by a so-called cow vigilante group. Patel sent her resignation to the BJP top brass seeking relief from the top job in the state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి