వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌: వరద బాధితులను రక్షించే ప్రయత్నంలో కానిస్టేబుల్ మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వరద బాధితులను కాపాడబోయి నీటిలో మునిగి చనిపోయిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వరద తీవ్ర నష్టం కలిగించింది.

మొత్తం 18 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. 50 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగులో వరదలో చిక్కుకున్న గ్రామస్థులను కాపాడేందుకు ఎస్‌డీఆర్ఎఫ్ ఆపరేషన్ చేపట్టింది.

గ్రామస్థులను కాపాడే క్రమంలో కెళ్ల శ్రీనివాస రావు అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం నీటిలో మునిగి చనిపోయారు. శ్రీనివాస రావు విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌డీఆర్ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట

తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు కట్ట

కడప జిల్లా రాజంపేట సమీపంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దాంతో ఎగువ నుంచి వస్తున్న నీరు దిగువకు వెళ్లిపోతోంది.

కట్ట నిన్న ఉదయం తెగిందని, దాంతో భారీ స్థాయిలో వరద ప్రవాహం సోమశిలకు చేరిందని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఐదు, పది టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు వరదల వల్ల కట్ట తెగిపోవడంతో ఇక్కడ ఒక్క టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు.

అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో దిగువకు వెళ్లిపోతున్న నీరు

ప్రాజెక్టు నిర్వహణ లోపాల వల్లే ఈ సమస్య వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఎగువన ఉన్న పించా ప్రాజెక్టు కట్ట కూడా తెగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిందని, సుమారు లక్షన్నర క్యూసెక్కుల వరద నీరు రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కూడా తెగిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ డ్యామ్ కట్ట తెగిపోవడం వల్ల 12 గ్రామాల్లో వరద హఠాత్తుగా విరుచుకుపడింది. నందలూరు, రాజంపేట మండలాల్లో కొందరు వరద నీటిలో గల్లంతయ్యారు.

కడప జిల్లాలో 12 మంది మరణించారని, 12 నుంచి 15మంది ఆచూకీ దొరకాలని అధికారులు చెబుతున్నారు.

రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో కిలోమీటరు మేర రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోయాయి

కిలోమీటరు మేర కొట్టుకుపోయిన రైలు పట్టాలు

రేణిగుంట-గుంతకల్ రైలు మార్గంలో కిలోమీటరు మేర రెండు ట్రాక్‌లు కోట్టుకుపోయాయి. పునరుద్ధరణకు వారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రెండు ట్రాక్‌లు అందుబాటులోకి రావాలంటే 15 రోజులు పడుతుందని భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లా చిగురువాడ దగ్గర తెగిపోయిన రోడ్డు మార్గం

మరోవైపు, రేణిగుంట-కడప జాతీయ రహదారిపై చెయ్యేరు వంతెన తెగిపోవడంతో 4 రోజులుగా రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను ఇవాళ క్లియర్ చేశారు.

వరద ప్రాంతాలు

కడప జిల్లా పులపుత్తూరు గ్రామంలో వరద ప్రభావం ఇలా ఉంది.

కడప జిల్లా పులపుత్తూరు గ్రామంలో కూలిన ఇల్లు

అయితే, ఒక పురాతన ఆలయం మాత్రం వరదను తట్టుకుని నిలబడింది.

వరదను తట్టుకుని నిలబడిన ఆలయం

ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం

మరోవైపు, భారీ వరదలకు తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ధ్వంసమైంది.

వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వీటిని పునరుద్ధరించడానికి, మరమ్మత్తులు చేయడానికి వారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను చూశారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.

ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతోపాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు.

రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు.

అటు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోని నేతలతో సమీక్షించారు. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు.

ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపినీ జరుగుతోంది. టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: A constable was killed while trying to rescue flood victims
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X