అత్యాచార యత్నం: కోపంతో మర్మాంగాలు కోసేశారు
జైపూర్: రాజస్థాన్‌లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తికి ప్రజలు భారీ దండన విధించారు. ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా ఆ వ్యక్తిని కొంత మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహంతో మాంసం కోసే కత్తితో అతని మర్మాంగాలను కోసేశారు.
దాడికి గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనపై అత్యాచారానికి ప్రయత్నించిన సమయంలో బాలి గట్టిగా కేకలు వేసింది. తనను రక్షించాలని అరిచింది. ఆ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని సురేష్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు.

గోడకు అమ్మాయిని ఒత్తేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా అతన్ని స్థానికులు పట్టుకుని వెనక్కి లాగారు. అతన్ని సమీపంలోని మటన్ షాప్‌కు తీసుకుని వెళ్లి, కర్రలతో విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత అతని మర్మాంగాలను కోసినట్లు మెయిల్ ఆన్‌లైన్ శుక్రవారంనాడు రాసింది.
అతని మర్మాంగాలను రోడ్డు మధ్యలో పడేశారు. గాయపడిన సురేష్ కుమార్‌ను సమీపంలో పడేశారు. సురేష్ కుమార్‌పై దాడి చేసినవారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తాము సహించబోమని అన్నారు.












Click it and Unblock the Notifications