‘స్పెషల్ సర్వీస్’: రూ.10 వేలు ఇస్తే అలా.. వేశ్యగా మార్చే ప్రయత్నం

అంకిత భండారీ హత్య కేసు ఉత్తరాఖండ్‌లో ప్రకంపనలు రేపుతోంది. హత్య కేసులో ఇప్పటికే బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. పుల్కిత్‌తోపాటు అమ్మాయి పనిచేస్తున్న రిసార్టు మేనేజర్ సౌరభ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

 Ankita Bhandari killed for refusing ‘special services’: police

యువతి మృతదేహాన్ని ఇవాళ ఉదయం ఓ కాలువ వద్ద గుర్తించారు. ఆ యువతి తన ఫ్రెండ్‌కు పంపిన భావిస్తోన్న వాట్సాప్ సందేశాలు వైరల్ అవుతున్నాయి. వేశ్యగా మార్చేందుకు రిసార్ట్ వాళ్లు ప్రయత్నిస్తున్నారని అందులో పేర్కొంది. రూ.10 వేలు చెల్లించిన కస్టమర్లకు 'ప్రత్యేక సేవలు' అందించాలని రిసార్ట్ యాజమాన్యం ఒత్తిడికి గురిచేస్తోందని వెల్లడించింది.

రిసార్ట్‌లో ఒకతను తనను అసభ్యంగా తాకాడని, అతను మద్యం మత్తులో ఉన్నందున పట్టించుకోవద్దని రిసార్ట్ యాజమాన్యం చెప్పిందని ఆమె తన సందేశంలో వివరించింది. రిసార్ట్ లోని ఓ ఉద్యోగికి ఆమె చేసిన వాయిస్ కాల్ కూడా తెరపైకి వచ్చింది. తన బాధలను ఆమె ఏడుస్తూ వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+