వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదలని వాన.. తమిళనాడు, శ్రీలంక.. వీకెండ్‌లో ఏపీలో

|
Google Oneindia TeluguNews

తమిళనాడు, ఏపీని వర్షాలు వదలడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోపు.. మరో అల్పపీడనం, వాయుగుండం వస్తున్నాయి. దీంతో వర్షాలు కంటిన్యూ అవుతన్నాయి. మరో 4 రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కన్యాకుమారి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు, ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పుదుచ్చేరి, కరైకల్ తోపాటు.. పలు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాతవారణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధించింది. తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రజా ప్రతినిధులు అధికారులకు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం స్టాలిన్ ఇప్పటికే కోరారు. స్వయంగా వర్షాలు, వరద బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను తనిఖీలు చేస్తున్నారు.

another 4 days rain in tamilnadu, sri lanka and ap

ఇటు ఏపీలో కూడా వర్షం అంటే జనం భయపడే పరిస్థితి నెలకొంది. వీకెండ్‌ ఏపీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. దీంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు, అనంతపురం, కడప సహా నెల్లూరులో వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇటు శ్రీలంకలో కూడా వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

ఈసారి కూడా ఏపీలో ఆ 4 జిల్లాలపై మరోసారి వర్ష ప్రభావం ఉంటుందని నిన్న వాతావరణ శాఖ తెలియజేసింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు ఎక్కువగా.. ప్రకాశంలో కాస్త.. వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఆ జిల్లాలే టార్గెట కావడం.. ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్న క్రమలో వాతావరణ శాఖ చేదు వార్తను తెలియజేసింది.

English summary
another 4 days rain hit in tamilnadu state and sri lanka. weekend rain at andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X