సెక్స్ స్కాండల్ కేసు, కొడుకు ప్రజ్వల్ దెబ్బకు తండ్రికి లూజ్ మోషన్, వాషౌట్, మరో కేసుతో హడల్!
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు కర్ణాటక రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో సహ పలువురు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
హాసన్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ అధికారులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై కూడా సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సిట్ అధికారులు ఎక్కడ తనను అరెస్టు చేస్తారో అని హడలిపోతున్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇప్పుడు ఊహించని మరో షాక్ తగిలింది.

అరెస్ట్ భయంతో హడలిపోతున్న మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు మరో షాక్ తగలడంతో హడలిపోతున్నాడు. హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు మైసూరులో మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణపై కేసు నమోదు చెయ్యడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. మైసూరు జిల్లా కేఆర్ నగర్ లో మహిళ అదృశ్యంపై మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణపై కేసు నమోదు అయ్యింది.
అదృశ్యమైన మహిళ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాయం అయిన మహిళ కుమారుడు ఇప్పుడు కేసు పెట్టాడు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల్లో నా తల్లి ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని, ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ అదృశ్యం అయ్యిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మైసూరు పోలీసు అదనపు కమిషనర్ కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ను వెళ్లి వివరాలు సేకరించారని సమాచారం.
సెక్స్ స్యాండల్ కేసు ప్రధాన నిందితుడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉండడంతో అతను భారత్ రాకుండా ఆలస్యం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ ప్రజ్వల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని అన్నారు ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారుల విచారణకు సహకరించకుంటే కచ్చితంగా అరెస్టు చేస్తామని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.












Click it and Unblock the Notifications