బెంగుళూరులో మణిపురి యువకుడిని చితకొట్టారు

ఆ సమయంలో ఓ మహిళను వేధిస్తున్న ముగ్గురు తాగుబోతుకు అతను అడ్డుచెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ ముగ్గురూ మణిపూర్ యువకుడిని చితకొట్టారు. తలకు తీవ్ర గాయాలైన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగుళూరులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిపై దాడులు జరగడం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా సార్లు వారిపై దాడులు జరిపారు. గత అక్టోబర్‌లో కన్నడం మట్లాడటం లేదని ముగ్గురు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను అక్కడి స్ధానికులు తీవ్రంగా కొట్టి గాయపరచిన ఘటన మరచిపోక ముందే ఈ ఘటన జరగడం విశేషం.
ఓ రెస్టారెంట్‌లో పుడ్ ఆర్డర్ చేసి ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులు. వారి పక్క టేబుల్స్‌లో కూర్చున్న కొంత మంది కన్నడ యువకులు.. ఇంగ్లీషులో మాట్లాడుకోవడం విని అభ్యంతరం తెలిపారు.
దీంతో వీరి మధ్య గొడవ పెద్దదై చివరకు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు స్ధానిక కన్నడ యువకులపై భయపెట్టడం మరియు దాడి చేసిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెంగుళూరులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సుమారు 240,000 మంది వివిధ రకాలైన పనులు చేసుకుంటూ జనజీవనం సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications