కేజ్రీవాల్ పై మరో పిడుగు: ఖలిస్తానీ టెర్రరిస్టుల నుండి 133కోట్ల రూపాయలు!!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టై ఈడీ విచారణని ఎదుర్కొంటుంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఖలిస్తానీ ఉగ్రవాదుల నుండి 133 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న సంచలన ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఖలిస్తానీ గ్రూప్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు.
2014నుంచి 2022వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూప్ 133. 54కోట్ల రూపాయలు ముట్ట చెప్పాయని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్ తమతో ఒక డీల్ కుదుర్చుకున్నారని, 1993 ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో దోషి అయిన దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ ను రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని, అలా చేయడం కోసం తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురుపత్వంత్ సింగ్ పన్ను సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన ఆయన ఖలిస్తానీ గ్రూప్ తో కేజ్రీవాల్ కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు. అయితే ఖలిస్తానీ గ్రూప్ తో కేజ్రీవాల్ కు సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అనేకమార్లు ఆరోపణలు చేసినప్పటికీ, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ ఈడి విచారణను ఎదుర్కొంటున్న సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారింది.
1993 ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 9 మంది చనిపోయారు. ఈ కేసులో ఖలిస్తానీ టెర్రరిస్ట్ దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆపై ఆయన మరణ శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చింది. దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ 20 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు.
కేజ్రీవాల్ పై మరో పిడుగు: ఖలిస్తానీ టెర్రరిస్టుల నుండి 133కోట్ల రూపాయలు..!! pic.twitter.com/nq3onNBFdR
— oneindiatelugu (@oneindiatelugu) March 26, 2024
ఈ క్రమంలో ఆయనను రిలీజ్ చేయాలని 133 కోట్లకు పైగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టుగా చెబుతున్న ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరవింద్ కేజ్రీవాల్ ను మళ్లీ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ గ్రూపుల నుండి ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని ఇప్పటికి అనేకమార్లు సంచలన ఆరోపణలు చేస్తున్న క్రమంలో, అరవింద్ కేజ్రీవాల్ పై ఈ వ్యవహారంలో కూడా దర్యాప్తు సంస్థలు ఏమైనా స్టెప్ తీసుకుంటాయా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications