ఇన్ఫోసిస్‌కు షాక్.. మరో సీనియర్ అధికారి గుడ్‌బై!
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆ కంపెనీకి మరో సీనియర్ అధికారి షాక్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. సీఈవో పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసిన నెల రోజుల వ్యవధిలోనే ఆ కంపెనీకి మరో సీనియర్ అధికారి షాక్ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ సీనియర్ ఉపాధ్యక్షుడు, డిజైన్ అండ్ రిసెర్చ్ హెడ్ సంజయ్ రాజగోపాలన్ తన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం తనకు స్వేచ్ఛ లభించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మూడు సంవత్సరాల రెండు నెలల పాటు ఇన్ఫీలో బాధ్యతలు నిర్వర్తించారు.

2014 ఆగస్టులో సంస్థలో చేరిన రాజగోపాలన్ ఇన్ఫోసిస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మైసూరుతో పాటు ఇతర ఇన్ఫీ కేంద్రాల్లోని ఎంతో మంది ఉద్యోగులకు ఆయన శిక్షణను ఇచ్చారు.
సిక్కా ఇన్ఫోసిస్‌లో చేరిన సమలయంలో తనతో పాటు కొంతమంది మాజీ శాప్ సహోద్యోగులను తీసుకొచ్చారు. వారిలో రాజగోపాలన్ కూడా ఒకరు. అయితే.. ఆయన రాజీనామాపై ఇప్పటి వరకు కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications