వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Anti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్ సమీపంలో హింసాకాండ .. 40 మంది అరెస్ట్ , 8మంది మైనర్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA 2019 : Anti CAA, 8 Minors Among 40 Detained At Delhi Gate in Daryaganj

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో చెలరేగిన ఆందోళనలు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. నిన్న నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన వ్యక్తం చేసిన తరువాత, పోలీసులపై రాళ్ళు రువ్వడం మరియు కార్లు తగలబెట్టటం వంటి ఘటనలు హింసాత్మకంగా మారాయి.
నిరసనలు అదుపు చెయ్యటానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించిన కొద్దిమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత

దర్యాగంజ్ వద్ద శుక్రవారం సాయంత్రం హింసాత్మకంగా మారిన సిఎఎ వ్యతిరేక నిరసనకు సంబంధించి ఎనిమిది మంది మైనర్లతో సహా 40 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, మొత్తం ఎనిమిది మంది మైనర్లను విడుదల చేయగా, మరికొందరు నిర్బంధంలోనే ఉన్నారు. అయితే, దర్యాగంజ్ పోలీస్ స్టేషన్ లోపల ఆందోళనకారులను కలవడానికి న్యాయవాదులకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ గేట్ సమీపంలో జరిగిన హింసాకాండలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.

Anti CAA WAR: 8 minors among 40 detained after violence near Delhi Gate in Daryaganj

ఇక దర్యాగంజ్ ప్రాంతంలో కొనసాగిన ఆందోళనలలో పోలీస్ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పాటు, పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో దర్యాగంజ్ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చెయ్యాల్సి వచ్చింది .

దర్యాగంజ్‌తో పాటు దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో సీఏఏపై నిరసనలు మిన్నంటాయి. ఆందోళనకారులు ఓ కారుకు నిప్పటించారు. ఇండియా గేట్, జంతర్ మంతర్, సీలాంపూర్ తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ''సీలాంపూర్ ఫ్లై ఓవర్, లోహ పూల్ ప్రాంతాల్లో ఆందోళన కారులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు .కాగా ముందస్తు జాగ్రత్తగా కొన్ని మెట్రో రైల్ స్టేషన్లను మూసివేశారు.

English summary
People protesting against the Citizenship Amendment Act hurled stones and set a car on fire, prompting the police to use water cannon to bring the situation under control. Over 40 people were detained which included 8 minors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X