వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Anti CAA WAR: యూపీ హింసాకాండ ... 12 మంది మృతులు ..కాల్పులే జరపలేదంటున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల నేపధ్యంలో చెలరేగిన ఆందోళనలు యూపీలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి .పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 12కి చేరింది. గత ఐదు రోజుల నుంచి యూపీలో జరుగుతూనే ఉన్న ఆందోళనలను అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా నిరసనలు తీవ్రరూపం దాల్చుతుండటంతో హింసాకాండ కొనసాగుతుంది. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పటం గమనార్హం .

Anti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్ సమీపంలో హింసాకాండ .. 40 మంది అరెస్ట్ , 8మంది మైనర్లుAnti CAA WAR: ఢిల్లీ గేట్ దర్యాగంజ్ సమీపంలో హింసాకాండ .. 40 మంది అరెస్ట్ , 8మంది మైనర్లు

యూపీలో 48గంటల్లో 12కు చేరిన మృతులు .. కాల్పులే జరగలేదన్న డీజీపీ

యూపీలో 48గంటల్లో 12కు చేరిన మృతులు .. కాల్పులే జరగలేదన్న డీజీపీ

యూపీలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల మృతుల సంఖ్యా వారణాసిలోని 8సంవత్సరాల చిన్నారితో కలిపి 48గంటల్లో 12కు చేరిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించినప్పటికీ అడిషనల్ డీజీపీ రామశాస్త్రి కేవలం ఆరుగురు మాత్రమే చనిపోయారని, అది కూడా ఘర్షణల్లో చనిపోయారని చెప్తున్నారు. అసలు కాల్పులే జరపలేదని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఘర్షణల్లో ఆరుగురు మాత్రమే మృతి చెందారన్న పోలీసులు

ఘర్షణల్లో ఆరుగురు మాత్రమే మృతి చెందారన్న పోలీసులు

3వేల 305మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 200మందిని అరెస్టు చేశారు. 21జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. శుక్రవారం ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. బులంద్‌షెహ‌ర్ లో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు.శుక్రవారం ప్రార్థనల తరువాత, రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనకారులు పోలీసులతో గొడవపడటంతో ఆరుగురు మృతి చెందారు. అయితే పోలీసుల కాల్పుల్లో మృతి చెందారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తుంటే పోలీసులు కాల్పుల విషయాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసుల కాల్పుల్లో మరణించిన వారు ఒక్కరూ లేరని చెప్తున్న పోలీసులు

పోలీసుల కాల్పుల్లో మరణించిన వారు ఒక్కరూ లేరని చెప్తున్న పోలీసులు

ఇక గోరఖ్‌పూర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల నేపథ్యంలో, నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని కొనసాగించడానికి పోలీసులు ఇక్కడ ఐపిసి సెక్షన్ 144 విధించారు. ఇక తాజా నిరసనల నేపధ్యంలో పలువురు ఆందోళనకారులతో పాటుగా పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులపై లాఠీ చార్జ్ కూడా చేశారు. లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రా, అలీగఢ్, ఘజియాబాద్, వారణాసి, మధుర, మీరట్, మొరాదాబాద్, ముజఫర్ నగర్, సంభల్, అమ్రోహా, మౌ, అజమర్, పిలిభిత్, రాంపూర్, బరేలీ, ఫిరోజాదాద్, సహారన్పూర్, షామ్లీ, ప్రాంతాలలో జరిగిన ఆందోళనలలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ పోలీసుల లెక్కల్లో కాల్పుల్లో చనిపోయినవారు ఒక్కరూ లేరు. ఘర్షణల్లో మృతులు మాత్రం ఆరుగురు ఉన్నట్టు వెల్లడిస్తున్నారు.

English summary
Uttar Pradesh in Friday's violence over Citizenship (Amendment) Act rises to Death toll 12,Although hospital sources say that the number of protests against the Citizenship Amendment Act in UP has risen to 12 in 48 hours, including an 8-year-old child in Varanasi, the police said only six people have died due to the violence. DGP Rama shasthri said that the actual shooting was not carried out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X