మళ్లీ భారత్ బంద్!: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోంశాఖ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏప్రిల్ 10న అంటే మంగళవారం నాడు భారత్ బందుకు కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక అడ్వయిజరీ జారీ చేసింది. పదో తేదీన మరోసారి భారత్ బందుకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు, సందేశాలు ప్రత్యక్షమయ్యాయి.

Anti-quota bandh call has police in MP, UP Rajasthan on high alert

కొన్ని గ్రూపులు రిజర్వేషన్ సిస్టంకు వ్యతిరేకంగా భారత్ బందుకు పిలుపునిస్తే, ఈ నెల 2 దళిత సంస్థల భారత్ బంద్ హింసాత్మకంగా మారడాన్ని వ్యతిరేకిస్తూ మరికొన్ని సంస్థలు బందుకు పిలుపునిచ్చాయి.

ఈ నెల 10 భారత్ బంద్ జరగబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. విద్యా, ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా లక్షల కొద్ది సందేశాలు వచ్చాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Security sources said calls for the so-called anti-quota bandh started circulating through social media, including various WhatsApp groups, after the protest on April 2 against the Supreme Court order mandating stringent safeguards before the SC/ST Act can be invoked.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి