యువతిని చెవిపట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ ఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆగ్రా:పోకిరీల నుండి యువతులను , మహిళలను వేధింపుల నుండి రక్షించాల్సిన ఓ పోలీసే వారిపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటనకు పాల్పడిన పోలీసు అదికారిపై బదిలీ వేటేసింది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్.

యువతులు , మహిళలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసేందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ యాంటీ రోమియో పోలీసు బృందాలను క్రియాశీలకం చేశాడు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి అమ్మాయిలపై వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు.

'anti-romeo' cop harasses girl in agra, transferred

మోయిన్ పూరికి చెందిన ఎస్సై రామ్ నరేష్ యాదవ్ యాంటీ రోమియో డ్రైవ్ లో భాగంగా లోహియాలోని ఓ పార్క్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఓ అమ్మాయిని వేధించాడు. ఆమె చెవులు పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

అతడితో ఉన్న మహిళా కానిస్టేబుళ్ళు అక్కడ ఉన్న అమ్మాయిలపై అరుస్తూ పార్క్ ల చుట్టూ తిరగకుండా ఇంటికి వెళ్ళిపోండంటూ హెచ్చరించాడు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో అతడిని వెంటనే పోలీస్ లైన్స్ కు బదిలీ చేశారు. దీనిపై విచారణ జరిపి ఆయననను బదిలీ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A sub inspector, Ram Naresh Yadav, was shifted to police lines on Wednesday after a video of him harassing a girl at a Lohia park.
Please Wait while comments are loading...