కాల్పులు: ఉద్యమకారుడు గోవింద్ పన్సారే ఆస్పత్రిలో కన్నుమూత
ముంబై: దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే శుక్రవారం రాత్రి మృతి చెందారు. మహారాష్ట్రలో టోల్ చార్జీల వసూళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గోవింద్ పన్సారే దంపతులు సోమవారం కోల్హాపూర్‌లో మార్నింగ్ వాక్ కు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు.

దీంతో పన్సారే తీవ్రంగా గాయపడ్డారు. భార్య సౌమ పన్సారే శరీరంలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. పన్సారే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.












Click it and Unblock the Notifications