ఎపి అసెంబ్లీ ఎన్నికల వాయిదా పుకార్లపై ఈసి ఆగ్రహం

Election Commission of India
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతుందని పుట్టిన పుకార్లపై ఎన్నికల కమిషన్ (ఈసి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువు లోపల ఎట్టి పరిస్థితిలోనూ ఎన్నికల నిర్వహిస్తామని ఈసి వర్గాలు చెబుతున్నాయి. జూన్ 2వ తేదీతో ప్రస్తుత శాసనసభ పదవీ కాలం ముగుస్తుంది. లోకసభ పదవీ కాలం మే 20వ తేదీతో ముగుస్తుంది.

దాంతో లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల పాటు శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

శాసనసభ పదవీకాలం ముగిసే లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి వర్గాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించినా గడువులోగా ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి తెలిసివారెవరూ ఎన్నికలు వాయిదా పడుతాయని మాట్లాడబోరని ఈసి వర్గాలంటున్నాయి.

రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మార్పులూ చేర్పులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని కూడా ఈసి వర్గాలు చెప్పాయి. ఈలోగా రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొహంతీతో రెండు రాష్ట్రాలను వెంటనే ఉనికిలోకి తేవడానికి జరిగిన ఏర్పాట్లపై రేపు బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+