రైలుటికెట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే!
ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడానికి భారతీయ రైల్వే నిరంతర కృషి చేస్తూనే ఉంది. రైళ్లలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వారి సేవలను సునాయాసం చేసేలా అనేక అవకాశాలను కల్పిస్తోంది. ఇక ప్రజలకు తెలిసేలా సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తోంది.
సుఖంగా ప్రయాణం చెయ్యాలంటే ఈ పని చెయ్యండి
ఇక తాజాగా రైల్వేకి సంబంధించి రైలులో టికెట్ రిజర్వ్ చేసుకోవాలనుకునే ప్రయాణికులకు ఒక కీలక విషయం చెప్పింది. రైలు టికెట్ ను irctc వెబ్ సైట్ లో గాని యాప్ ద్వారా గాని బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు అందులో ఉన్న ఒక చిన్న ఆప్షన్ ను ఎంచుకోవడం వల్ల సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.

ఆటో అప్ గ్రేడేషన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రైలు ప్రయాణికులకు బెనిఫిట్
యాప్ లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆటో అప్ గ్రేడేషన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రైలు ప్రయాణ అవకాశాన్ని బట్టి ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. ఈ విధానం వల్ల ప్రయాణికులు అదనపు ఖర్చు లేకుండా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందగలుగుతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రయాణికులు తాము ఎంచుకున్న క్లాస్ కంటే పై క్లాసులో ఖాళీ సీట్లు ఉన్నట్లయితే ఆటోమేటిగ్గా అప్గ్రేడ్ అవుతారు.
ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
ఉదాహరణకు స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ సిట్టింగ్ టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి థర్డ్ ఏసి లేదా చైర్ కార్ లో సీటు దొరికే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రయాణికులు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. థర్డ్ ఏసి తరగతిలో ప్రయాణించేందుకు బుక్ చేసుకునే వారికి అందులో సీట్లు లేకపోతే సెకండ్ ఏసీలో అవకాశం ఇస్తారు.
బుక్ చేసుకున్న క్లాసులో వెయిటింగ్ లిస్ట్ ఉన్నా సరే
సెకండ్ ఏసి లో బుక్ చేసుకున్న వారు ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయడానికి ఈ అప్ గ్రేడేషన్ సహాయం చేస్తుంది. దీంతో అడిషనల్ గా ఎలాంటి ఖర్చు లేకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని చేయవచ్చు. టికెట్ బుక్ చేసుకునే వారు తాము బుక్ చేసుకున్న క్లాసులో వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పటికీ పై క్లాస్ లో ఖాళీలు ఉంటే ఆటోమేటిగ్గా అక్కడికి అప్ గ్రేడ్ అవుతారు.
ఈ ఫెసిలిటీ ఇలా పొందొచ్చు
రైలు ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందాలి అంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలో కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అనే ఆప్షన్ ను తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒక్కసారి అప్ గ్రేడ్ జరిగిన తర్వాత తిరిగి పాత క్లాస్ కు మారే అవకాశం ఉండదు. తక్కువ ఖర్చుతో మెరుగైన సౌకర్యాలు పొందాలనుకునే రైల్వే ప్రయాణికులకు ఈ సదుపాయం చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications